ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. నాలుగు కేంద్ర కేబినెట్ కమిటీలను రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఆధార్ కార్డుల కోసం ఉద్దేశించిన కమిటీని కూడా రద్దు చేశారు. రద్దు చేసినవాటిలో మేనేజ్మెంట్ ఆఫ్ నేచరల్ కేలామటీస్, ధరల కమిటీ, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ మేటర్స్ కమిటీ ఉన్నాయి.
మరి కొన్ని కమిటీలను పునర్వవస్థీకరించాలని మోడీ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అపాయింట్మెంట్స్, ఎకనామిక్ ఎఫైర్స్, పార్లమెంటరీ ఎఫైర్స్, పొలిటికల్ ఎఫైర్స్, భద్రత కమిటీలను పునర్వవస్థీకరించే ఆలోచనలో మోడీ ఉన్నట్లు తెలుస్తోంది.