నాటి ఖైదీలకు మోదీ సత్కారం!
న్యూఢిల్లీ: ఎమర్జెన్సీ కాలంలో జైలుకు వెళ్లిన రాజకీయ నాయకులు, వ్యక్తులను ప్రధానమంత్రి నరేంద్రమోదీ సత్కరించనున్నారు. ఆదివారం లోక్నాయక్ జయప్రకాశ్ నారాయణ్ జయంతి సందర్భంగా ఆయన ఎమర్జెన్సీకాలం నాటి ఖైదీలకు సన్మానం నిర్వహించనున్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ను ఇది ఇరకాటంలో పడేసే అవకాశముంది. 'లోక్తంత్ర కే ప్రహరి' పేరిట నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకుడు ఎల్కే అద్వానీ, పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాశ్సింగ్ బాదల్ కూడా పాల్గొననున్నారు.
1975-76 మధ్యకాలంలో విధించిన ఎమర్జెన్సీ భారత ప్రజాస్వామ్యానికి చీకటి యుగమని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. దేశప్రజస్వామిక ప్రయోజనార్థం నూతన తరానికి ఎమర్జెన్సీ గురించి తెలియాల్సిన అవసరముందని చెప్పారు.