పాకిస్థాన్ సహా.. ఎనిమిది దేశాల అధినేతలు నరేంద్రమోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కాబోతున్నారు. ఈ విషయాన్ని ఆయా దేశాల ప్రతినిధులు ఖరారు చేసినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ శనివారం తెలిపింది. పాక్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ తమ ఆహ్వానాన్ని మన్నించి ఈ కార్యక్రమానికి హాజరవుతున్నట్లుగా తమకు సందేశం అందిందని విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ తెలిపారు.
ఇలా మొత్తం ఎనిమిది దేశాల ప్రతినిధులు తాము వస్తున్నట్లు నిర్ధారించారని ఆయన చెప్పారు. అఫ్ఘానిస్థాన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్, మాల్దీవుల అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్, శ్రీలంక అధ్యక్షుడు మహీంద రాజపక్స, భూటాన్ ప్రధాని షెరింగ్ టాబ్గే, నేపాల్ ప్రధాని సుశీల్ కొయిరాలా, బంగ్లాదేశ్ పార్లమెంటు స్పీకర్ శిరిన్ షర్మీన్ చౌధురి వస్తున్నారు. వీళ్లంతా సార్క్ దేశాల ప్రతినిధులు కావడం గమనార్హం. ఇంకా, మారిషస్ ప్రధాని నవీన్ చంద్ర రామ్గులామ్ కూడా వస్తున్నారు.
మోడీ ప్రమాణస్వీకారానికి ఎనిమిది దేశాల అధినేతలు
Published Sat, May 24 2014 4:12 PM | Last Updated on Wed, Sep 26 2018 3:36 PM
Advertisement