
మతతత్వ శక్తులకు మోడీ ఒక ప్రతినిధి:కారత్
కోల్కతా: బీజేపీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీపై సీపీఐ(ఎం) జనరల్ సెక్రటరీ ప్రకాశ్ కారత్ విమర్శల వర్షం గుప్పించారు. మతతత్వ శక్తులకు మోడీ ఒక ప్రతినిధిలా వ్యవరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. నగరంలోని ర్యాలీలో పాల్గొనేందుకు వచ్చిన కారత్..మోడీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మోడీ విద్వేషాలను రెచ్చగొడుతూ మతతత్వానికి ఆజ్యం పోస్తున్నారన్నారు. గతంలో బాబ్రీ మసీదు కూల్చివేత ఘటనలో కూడా మోడీ హస్తం ఉందనే విషయం కాదనలేని వాస్తమన్నారు. మోడీ వెనుక ఆర్ఎస్ఎస్ పనిచేస్తుందని కారత్ తెలిపారు.
దేశంలో పేట్రేగి పోతున్నమతతత్వ పోకడలను నిర్మూలించేందుకు లెఫ్ట్ పార్టీలతో సహా, స్థానిక పార్టీలు కృషి చేసేందుకు నడుంబిగించాయన్నారు. ఈ క్రమంలోనే తమ పార్టీ లౌకిక వాద ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తుందని తెలిపారు. ప్రస్తుతం యూపీఏ ప్రభుత్వం నియంతృత్వ పోకడలతో పరిపాలన సాగిస్తోందన్నారు.