స్వల్పలాభాల్లో స్టాక్ మార్కెట్లు
Published Wed, Dec 21 2016 9:57 AM | Last Updated on Mon, Sep 4 2017 11:17 PM
అంతర్జాతీయంగా వస్తున్న పాజిటివ్ సంకేతాలతో బుధవారం ట్రేడింగ్ ప్రారంభంలో ఈక్విటీ బెంచ్మార్కులు కోలుకున్నాయి. సెన్సెక్స్ 43.75 పాయింట్ల లాభంలో 26,351 వద్ద, నిఫ్టీ 12.85 పాయింట్ల లాభంలో 8,095 వద్ద కొనసాగుతున్నాయి. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్సియల్, ఆటో, ఎంపికచేసిన టెక్నాలజీ, ఇన్ఫ్రా స్టాక్స్ మద్దతుతో నిఫ్టీ ప్రారంభంలో తన 8100 మార్కును పునరుద్ధరించుకోగలిగింది. అనంతరం 8100 దిగువ స్థాయికి జారి ట్రేడ్ అవుతోంది. సెన్సెక్స్ సైతం ఒడిదుడుకులుగా కొనసాగుతోంది.
హెచ్డీఎఫ్సి, ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంకు, ఎల్ అండ్ టీ, సన్ ఫార్మా, ఎస్బీఐ మార్కెట్లో లాభాలార్జిస్తుండగా.. టీసీఎస్, ఐటీసీ, హెచ్డీఎఫ్సి బ్యాంకు, హెచ్యూఎల్ షేర్లు అమ్మకాల ఒత్తిడిలో కొనసాగుతున్నాయి. గత సెషన్ ముగింపులో 68.03 స్థాయిని తాకిన డాలర్తో రూపాయి మారకం విలువ బుధవారం ట్రేడింగ్లో కొంత రికవరీ అయింది. 10 పైసల లాభంతో 67.93గా ప్రారంభమైంది. అటు ఎంసీఎక్స్ మార్కెట్లో బంగారం ధర పడిపోతోంది. 10 గ్రాముల బంగారం ధర 137 రూపాయలు కోల్పోయి 27,123గా కొనసాగుతోంది.
Advertisement
Advertisement