మోదీ.. ఈ నీతి వచనాలను మీరు ఆచరించారా?: నితీశ్ | NItish fires on modi | Sakshi
Sakshi News home page

మోదీ.. ఈ నీతి వచనాలను మీరు ఆచరించారా?: నితీశ్

Published Wed, Oct 14 2015 4:24 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

మోదీ.. ఈ నీతి వచనాలను మీరు ఆచరించారా?: నితీశ్ - Sakshi

మోదీ.. ఈ నీతి వచనాలను మీరు ఆచరించారా?: నితీశ్

పట్నా: జేడీయూ ప్రభుత్వంలోని ఓ మంత్రి డబ్బులు తీసుకున్నారని.. లాలూ, నితీశ్‌లకు సిగ్గులేదని మోదీ చేసిన విమర్శలపై నితీశ్ ట్విటర్‌లో విరుచుకుపడ్డారు. ‘లలిత్‌గేట్, వ్యాపమ్ స్కాం తర్వాత ఏనాడూ అవినీతిపై పెదవి విప్పని మోదీ.. ఇప్పుడు బిహార్‌లో ఓటమి భయంతోనే అవినీతిపై ఉపన్యాసాలు ఇస్తున్నారు. మీ నీతి వచనాలను మీరెప్పుడు పాటించారో చెప్పగలరా?’ అని ప్రశ్నించారు.  లంచం తీసుకుంటున్నట్లు స్టింగ్ ఆపరేషన్ వీడియోలో కనిపించిన బిహార్ మాజీ మంత్రి అవధేశ్ కుష్వాహాపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది.

 బీజేపీకి ఓటా? ఆటవిక పాలనా?
 నితీశ్-లాలూ కూటమి బిహార్‌కు పునర్వైభవం తీసుకురాలేదని బీజేపీ చీఫ్ అమిత్ షా అన్నారు. బిహార్ ప్రజలు అభివృద్ధి కోసం బీజేపీకి ఓటేయడమో, లేకపోతే నితీశ్- లాలూ కూటమికి ఓటేసి ఆటవిక పాలన తెచ్చుకోవడమో తేల్చుకోవాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement