JDU Government
-
పాలిటిక్స్‌లో పిడుగుపాటు.. బీజేపీతో సీఎం నితీశ్ కుమార్ తెగదెంపులు!
పట్నా : బిహార్‌లో జేడీ(యూ), బీజేపీ సంకీర్ణ సర్కార్ మధ్య విభేదాలు మరింత ముదిరిపోయాయి. ఎన్డీయేకి గుడ్‌బై కొట్టాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ దాదాపుగా నిర్ణయించుకున్నారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించడానికి మంగళవారం ఉదయం 11 గంటలకు ఆయన పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో సమావేశం ఏర్పాటు చేశారు. జేడీ(యూ)లో సీనియర్ నాయకుడు ఆర్సీపీ సింగ్ గత కొద్ది రోజులుగా బీజేపీకి సన్నిహితంగా వ్యవహరిస్తూ నితీశ్ వ్యవహారశైలిని నిందిస్తూ వస్తున్నారు. శనివారం ఆయన హఠాత్తుగా పార్టీని వీడడంతో పార్టీలో ఒక్కసారిగా కలకలం రేగింది. మహారాష్ట్రలో శివసేన మాదిరి బిహార్‌లో జేడీ(యూ)లో చీలికలు తేవడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని జేడీ(యూ) నేతలు ఆరోపిస్తున్నారు. ఆర్సీపీ సింగ్ మరో ఏక్నాథ్ షిండేగా మారే అవకాశాలపై పార్టీలో అంతర్గతంగా చర్చ జరుగుతోంది. నితీశ్ ఆదివారం రాత్రి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీతో ఫోన్లో మాట్లాడారని రాష్ట్రంలో తిరిగి ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలతో ఆయన జత కడతారన్న ప్రచారం సాగుతోంది. ఎన్డీయే నుంచి జేడీ(యూ) బయటకి వచ్చినప్పటికీ ఆర్జేడీ, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు. అయితే ఈ రోజు జరిగే సమావేశంతో దీనిపై ఒక స్పష్టత వస్తుంది. నితీశ్ ఎన్డీయే నుంచి బయటకు వస్తే వారితో జత కట్టడానికి తాము సిద్ధమేనని ఆర్జేడీ జాతీయ ఉపాధ్యక్షుడు శివానంద తివారీ స్పష్టం చేశారు. ఆర్జేడీ మంగళవారం తమ పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశాన్ని ఏర్పాటు చేయడంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. నితీశ్‌ను స్వాగతిస్తాం: ప్రతిపక్షాలు బీజేపీ నుంచి దూరమైతే నితీశ్‌కు అండగా నిలుస్తామని బిహార్‌లోని ప్రతిపక్షాలు ప్రకటించాయి. రాష్ట్రంలో బీజేపీయేతర పార్టీలన్నీ ఒకే వేదికపైకి వస్తే స్వాగతిస్తామని కమ్యూనిస్ట్ పారీ్టలు వెల్లడించాయి. జేడీ(యూ)కు చేయూతనందిస్తామని 12 మంది ఎమ్మెల్యేలున్న సీపీఐ(ఎంఎల్)ఎల్ పేర్కొంది. నితీశ్‌ను, జేడీ(యూ)తో చేతులు కలపడానికి తాము సిద్ధమేనని ఆర్జేడీ స్పష్టం చేసింది. బీజేపీపై తాము పోరాడుతున్నామని, ఈ పోరాటంలో నితీశ్‌ను కలుపుకొని వెళ్తామని ఆర్జేడీ నేత తివారీ చెప్పారు. బీజేపీతో బంధం తెంచేసుకొని వస్తే జేడీ(యూ)ను సాదరంగా ఆహా్వనిస్తామని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి షకీల్ అహ్మద్ ఖాన్ అన్నారు. ఇదిలా ఉండగా, నితీశ్ ఆదివారం ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాం«దీతో స్వయంగా మాట్లాడారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై వారిద్దరూ చర్చించుకున్నట్లు తెలిసింది. మంగళవారం జరిగే జేడీ(యూ) ఎంపీలు, ఎమ్మెల్యేల భేటీలో తదుపరి వ్యూహాన్ని నితీశ్ ఖరారు చేయనున్నట్లు సమాచారం. ఇది కూడా చదవండి: అమిత్ షాను నమ్మలేం.. మరో ఉద్దవ్ థాక్రే కావడం ఇష్టం లేకనే! -
‘ప్రాణభయం ఉంది.. రక్షణ కల్పించండి’
పట్నా : ఆర్జేడీ చీఫ్ లాలూ కుమారుడు, మాజీ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ జేడీయూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు లోపించాయని చెప్పారు. తనకు ప్రాణ భయం ఉందనీ, రక్షణ కల్పించాలని నితీష్ ప్రభుత్వాన్ని కోరారు. ‘రోజు హత్యలు, అల్లర్లతో పరిస్థితులు భయానకంగా మారాయి. ఎవరు ఎవరినైనా చంపొచ్చు. నాకు ప్రాణ భయం ఉంది. రక్షణ కల్పించండి’అని మీడియా సమావేశంలో జేడీయూ ప్రభుత్వాన్ని కోరారు. సెక్యురిటీగా బాడీగార్డులు ఉన్నా ప్రాణలకు గ్యారంటీ లేదని అన్నారు. అంతగా రాష్ట్రంలో శాంతిభద్రతలు దిగజారాయని వ్యాఖ్యానించారు. పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. (నాయకుడి హత్య... నిందితుడి కొడుకు బలి) ఇక మంగళవారం రాష్ట్రీయ జనతాదళ్ పార్టీకి చెందిన ఇందాల్ పాశ్వాన్ అనే నాయకుడి హత్య నలందాలో అల్లర్లకు కారణమైంది. గడిచిన వారం రోజుల్లో ఇటువంటి మూడు ఘటనలు చోటుచేసుకోవడంతో నితీష్ కుమార్ ప్రభుత్వంపై ఆగ్రహజ్వాలలు పెల్లుబుకుతున్నాయి. ఇందాల్ మృతికి కారకుడిగా భావిస్తున్న ఓ వ్యక్తి ఇంటికి బుధవారం కొందరు నిప్పంటించారు. అంతేకాకుండా అతడి కొడుకు (13)ను తీవ్రంగా కొట్టడంతో ఆ బాలుడు మృతిచెందాడు. దీంతో నలందాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాగా, గత ఆదివారం బిహార్‌లో మావోయిస్టులు రెచ్చిపోయారు. ఔరంగాబాద్ జిల్లాలో ఓ వ్యక్తిని కాల్చిచంపడంతో పాటు నాలుగు బస్సులను తగులబెట్టారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు లోపించాయని పేర్కొంటూ రాజధాని పట్నాలో విపక్షాలు నిరసనలు చేపట్టాయి. -
నేను చనిపోతే.. నితీష్ అనూహ్య వ్యాఖ్యలు!
పట్నా : అనూహ్య వ్యాఖ్యలు చేసి బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పార్టీ సీనియర్ నేతలకు షాకిచ్చారు. ఆయన గత వారాంతంలో నిర్వహించిన సమావేశాల చివరి రోజున జేడీయూ నేతలను ఉద్దేశిస్తూ 'నేను చనిపోతే పార్టీకి ఏమవుతుంది? ప్రశ్నించారు. దీంతో అందరూ ఒక్కసారిగా అవాక్కయ్యారు. దాదాపు 215మంది పార్టీ ముఖ్యులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో నితీష్ చేసిన వ్యాఖ్యలపై విస్తృత స్థాయి చర్చ జరిగింది. తమ అధికార పార్టీ మరోసారి ఆత్మ విమర్శ చేసుకోవాలని, నిబంధనలకు కట్టుబడి పనిచేయాలని కోరారు. రాష్ట్ర ప్రజలకు పార్టీ ఒక బాధ్యతగా భావించి సేవలు చేయాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. తాను లేకపోయినప్పటికీ ప్రతిఒక్కరు పార్టీ, ప్రజల విషయంలో బాధ్యతయుతంగా సాగాలని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ, లాలూ ప్రసాద్ యాదవ్‌తో తెగదెంపులు చేసుకొని బీజేపీతో పొత్తుపెట్టుకొని మరోసారి అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే, అప్పటి నుంచి రాష్ట్రంలో పరిస్థితులు సక్రమంగా లేవు. ఎప్పటి నుంచో కలిసి ఉంటున్న సీనియర్ నేత శరద్ యాదవ్ ఆయనకు దూరమయ్యారు. మరికొందరు నేతలు నితీష్‌ను వ్యతిరేకిస్తున్నారు. క్రమశిక్షణ తప్పిన తీరు పార్టీలో కనిపిస్తోంది. దీంతో నితీష్ అడిగిన ప్రశ్న ప్రతి ఒక్కరినీ ఆలోచనలో పడేసింది. అటుపక్క లాలూ తన కుమారులను రాజకీయరంగంలో దింపిన విషయం తెలిసిందే. నితీష్‌కు ఓ కుమారుడు ఉన్నప్పటికీ ఆయనకు రాజకీయాల పట్ల ఆసక్తి లేదు. కాగా, నితీష్ వ్యాఖ్యలపై వశిష్ట నారాయణ్ సింగ్ స్పందిస్తూ మరో పదేళ్ల వరకు నితీష్ కుమార్ తర్వాత ఎవరు అనే విషయం తాము ఆలోచించనక్కర్లేదని అన్నారు. అయితే, నితీష్ వ్యాఖ్యలను కూడా తాము ముఖ్యమైనవిగా పరిగణిస్తున్నామని, పెద్ద పెద్ద బాధ్యతలు అందుకునేలా పార్టీలో ప్రతి ఒక్కరూ నిజాయితీగా పనిచేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. -
మోదీ.. ఈ నీతి వచనాలను మీరు ఆచరించారా?: నితీశ్
పట్నా: జేడీయూ ప్రభుత్వంలోని ఓ మంత్రి డబ్బులు తీసుకున్నారని.. లాలూ, నితీశ్‌లకు సిగ్గులేదని మోదీ చేసిన విమర్శలపై నితీశ్ ట్విటర్లో విరుచుకుపడ్డారు. ‘లలిత్‌గేట్, వ్యాపమ్ స్కాం తర్వాత ఏనాడూ అవినీతిపై పెదవి విప్పని మోదీ.. ఇప్పుడు బిహార్‌లో ఓటమి భయంతోనే అవినీతిపై ఉపన్యాసాలు ఇస్తున్నారు. మీ నీతి వచనాలను మీరెప్పుడు పాటించారో చెప్పగలరా?’ అని ప్రశ్నించారు. లంచం తీసుకుంటున్నట్లు స్టింగ్ ఆపరేషన్ వీడియోలో కనిపించిన బిహార్ మాజీ మంత్రి అవధేశ్ కుష్వాహాపై ఎఫ్ఐఆర్ నమోదైంది. బీజేపీకి ఓటా? ఆటవిక పాలనా? నితీశ్-లాలూ కూటమి బిహార్‌కు పునర్వైభవం తీసుకురాలేదని బీజేపీ చీఫ్ అమిత్ షా అన్నారు. బిహార్ ప్రజలు అభివృద్ధి కోసం బీజేపీకి ఓటేయడమో, లేకపోతే నితీశ్- లాలూ కూటమికి ఓటేసి ఆటవిక పాలన తెచ్చుకోవడమో తేల్చుకోవాలన్నారు.