తీరు మార్చుకోని సల్మాన్ ఖాన్! | No Apology from Salman, Says Women Panel Can not Summon Him | Sakshi
Sakshi News home page

తీరు మార్చుకోని సల్మాన్ ఖాన్!

Published Thu, Jul 14 2016 3:42 PM | Last Updated on Sat, Jul 28 2018 8:43 PM

తీరు మార్చుకోని సల్మాన్ ఖాన్! - Sakshi

తీరు మార్చుకోని సల్మాన్ ఖాన్!

ముంబై: తనను తాను అత్యాచారానికి గురైన మహిళతో పోల్చుకుంటూ వివాదాస్పద వ్యాఖ్యలు సల్మాన్ ఖాన్ ఈ విషయంలో క్షమాపణ చెప్పడానికి మరోసారి నిరాకరించారు. అంతేకాకుండా మహారాష్ట్ర మహిళా కమిషన్ ఎదుట హాజరయ్యేందుకు ఆయన నిరాకరించారు. ఈ వివాదంలో సల్మాన్ క్షమాపణ చెప్పాల్సిందేనని మహిళా కమిషన్ డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకు ఆయన నిరాకరించడంతో తమ ఎదుట హాజరుకావాలని సల్మాన్ కు మహిళా కమిషన్ రెండుసార్లు సమన్లు పంపంది.

అయితే, తనను హాజరుకావాలని ఆదేశిస్తూ సమన్లు పంపే చట్టబద్ధ అధికారం మహిళా కమిషన్ కు లేదని సల్మాన్ తన తాజా లేఖలో పేర్కొన్నట్టు తెలిసింది. ఈ మేరకు తాజా సమన్లకు సల్మాన్ తన ప్రతిస్పందనను తెలిపారు. సల్మాన్ ప్రతిస్పందన తమకు అందిందని, అతని లేఖను క్షుణ్ణంగా చదివిన తర్వాత భవిష్యత్ చర్యలు తీసుకుంటామని మహిళా కమిషన్ అధికార ప్రతినిధి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement