
సినిమా తారలకు అందని ఆహ్వానం
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా గౌరవార్థం రాష్ట్రపతిభవన్ లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆదివారం రాత్రి ఏర్పాటు చేసిన ప్రత్యేక విందులో సినిమా తారలు ఎవరూ పాల్గొనడడం లేదు. 250 మంది ప్రముఖులను ఈ విందుకు ఆహ్వానించారు. వీరిలో రాజకీయ నేతలు, కార్పొరేట్ దిగ్గజాలు ఈ విందులో పాల్గొనున్నారు.
నోబెల్ గ్రహీత కైలాశ్ సత్యార్థి, సరోద్ విద్యాంసుడు అమ్జందాద్ అలీ ఖాన్, పర్యావరణవేత్త ఆర్కే పచౌరీలతో పాటు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, బీజేపీ సీనియర్ నేత ఎల్ కే అద్వానీ తదితరులను విందుకు ఆహ్వానించారు. కార్పొరేట్ దిగ్గజాలు రతన్ టాటా, గౌతమ్ అదానీ, ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ, నారాయణమూర్తి, చందా కొచ్చర్, ప్రతాపరెడ్డి విందుకు హాజరుకానున్నారు.