కనీసం ఏడుసార్లు ముఖాముఖి | Modi, Obama to interact at least seven times during visit | Sakshi
Sakshi News home page

కనీసం ఏడుసార్లు ముఖాముఖి

Published Fri, Jan 23 2015 2:34 AM | Last Updated on Fri, Aug 24 2018 8:06 PM

కనీసం ఏడుసార్లు ముఖాముఖి - Sakshi

కనీసం ఏడుసార్లు ముఖాముఖి

న్యూఢిల్లీ: భారత్ పర్యటనలో అమెరికా అధ్యక్షుడు ఒబామా, భారత ప్రధాని మోదీ ఏడుసార్లు ముఖాముఖి కలువనున్నారు. ఒబామా ఈనెల 25న ఉదయం పదిగంటలకు ఢిల్లీలో దిగుతారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగే ఆహ్వాన కార్యక్రమంలో ప్రణబ్, మోదీ పాల్గొంటారు. అనంతరం హైదరాబాద్ హౌజ్‌లో ద్వైపాక్షిక చర్చల్లో రెండోసారి కలుస్తారు. సాయంత్రం రాష్ట్రపతి ఇచ్చే విందులో మరోసారి కలుసుకుంటారు. రిపబ్లిక్ డే పరేడ్‌లో ఒబామా, మోదీ ఒకే దగ్గర కూర్చుంటారు. ఆ సాయంత్రం రాష్ట్రపతి ఇచ్చే విందులో  వీరిద్దరూ ఐదోసారి కలుస్తారు. అదే రోజు వ్యాపారవేత్తల సమావేశంలో పాల్గొంటారు. ‘మన్ కీ బాత్’ పేరిట 27న ప్రసారమయ్యే రేడియో కార్యక్రమం రికార్డింగ్ కోసం వీరిద్దరూ ఏడోసారి కలుస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement