మరోసారి ఆపిల్పై యుద్ధానికి దిగిన నోకియా | Nokia sues Apple in US and Germany for infringing patents | Sakshi
Sakshi News home page

మరోసారి ఆపిల్పై యుద్ధానికి దిగిన నోకియా

Published Thu, Dec 22 2016 9:39 AM | Last Updated on Fri, Aug 24 2018 7:24 PM

మరోసారి ఆపిల్పై యుద్ధానికి దిగిన నోకియా - Sakshi

మరోసారి ఆపిల్పై యుద్ధానికి దిగిన నోకియా

టెక్ దిగ్గజం ఆపిల్కు, ఫీచర్ ఫోన్ల దిగ్గజం నోకియాకు మరోసారి పేటెంట్ల యుద్ధం ప్రారంభమైంది.  కంపెనీకి చెందిన పలు పేటెంట్లను ఆపిల్ దొంగతనం చేసిందని ఆరోపణలతో అమెరికా, జర్మనీలో ఆ కంపెనీపై పలు ఫిర్యాదులు దాఖలు చేసినట్టు నోకియా ప్రకటించింది. టాబ్లెట్స్, మొబైల్ ఫోన్స్, పర్సనల్ కంప్యూటర్ల వంటి పలు కన్సూమర్ ఎలక్ట్రానిక్స్లో మూడు విలువైన పేటెంట్ పోర్ట్ఫోలియోను తాము కలిగి ఉన్నామని నోకియా పేర్కొంది. అయితే వాటికి సంబంధించిన 32కు పైగా పేటెంట్లను ఆపిల్ ఉల్లంఘించిందని నోకియా వాదిస్తున్నది.
 
20 ఏళ్ల తమ ఇండస్ట్రిలో సుమారు రూ.8 లక్షల కోట్లను పరిశోధన, అభివృద్ధిలో పెట్టుబడులు పెట్టినట్టు నోకియా పేర్కొంది. వేలకొలది పేటెంట్ హక్కులను ఇది సంపాదించుకోగలిగింది. అయితే తమ పరిశోధన, అభివృద్ధిలో సృష్టించిన పలు ఫడమెంటల్ టెక్నాలజీస్ను ప్రస్తుతం చాలా మొబైల్ డివైజ్లు వాడుతున్నాయని నోకియా ఆరోపిస్తోంది. దీనిలో ఆపిల్ కూడా ఉన్నట్టు పేర్కొంది.
 
తమ పేటెంట్లను వాడుకుంటున్నందుకు ఓ ఒప్పందం కుదుర్చుకోవడానికి ఆపిల్తో చాలాసార్లు చర్చలు జరిపామని, కానీ ప్రస్తుతం తమ హక్కులు వాడుకుంటున్నందుకు చర్యలు తీసుకునే సమయం ఆసన్నమైందని నోకియా పేటెంట్ బిజినెస్ హెడ్ చెప్పారు. అయితే నోకియా, ఆపిల్పై కేసు నమోదుచేయడం ఇదేమీ మొదటిసారి కాదు. 2009లోనే ఆపిల్ తమ పేటెంట్లను ఉల్లంఘించిందని నోకియా ఆరోపించింది. దీనికి ఆపిల్ కూడా నోకియాపై కౌంటర్ ఫైల్ దాఖలు చేసింది. 2011లో ఇరు కంపెనీల మధ్య ఒప్పందం కుదరడంతో ఆ పేటెంట్ వార్ ముగిసింది. 2011 అ‍్రగిమెంట్ నుంచి ఆపిల్ తమకు చెందిన పలు పేటెంట్ హక్కులను ఉల్లంఘిస్తుందని నోకియా మరోసారి ఆరోపణలకు దిగింది. 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement