యూపీఏ పాలన సమస్తం లంచాల బాగోతమేనన్న విషయం మరోసారి బయటపడింది. నార్వేకు చెందిన యారా ఇంటర్నేషనల్ అనే ఎరువుల తయారీ సంస్థ మన దేశానికి ఎరువులు సరఫరా చేసే కాంట్రాక్టు కోసం ఇక్కడి మంత్రిత్వశాఖ అధికారులకు లంచాలు ఇచ్చింది. ఈ కేసులో ఆ కంపెనీకి చెందిన ముగ్గురు మాజీ సీనియర్ మేనేజిమెంట్ అధికారులను అక్కడి పోలీసులు అరెస్టు చేశారు.
కేంద్ర ఎరువులు, రసాయనాల మంత్రిత్వశాఖలోని ఆర్థిక సలహాదారు కుటుంబానికి ఈ లంచం చెల్లించినట్లు ఓస్లో నుంచి వచ్చిన కథనాలను బట్టి తెలుస్తోంది. భారతదేశంతో పాటు లిబియా, రష్యాలలోని అధికారులకు కూడా లంచాలు ఇచ్చినందుకు గాను ఈ కంపెనీకి చెందిన అధికారులకు నార్వే ప్రభుత్వం దాదాపు 295 కోట్ల రూపాయల జరిమానా విధించింది.
ఎరువుల శాఖలో లంచాల బాగోతం!!
Published Fri, Jan 17 2014 8:36 PM | Last Updated on Mon, Oct 1 2018 6:45 PM
Advertisement
Advertisement