26 ఏళ్లకే వర్జినిటీ కోల్పోయాను! | Not chasing sex anymore, I lost my virginity when I was 26, says Karan Johar | Sakshi
Sakshi News home page

సెక్స్ పార్టీకి నన్ను ఆహ్వానించారు!

Published Wed, Jun 29 2016 4:38 PM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

26 ఏళ్లకే వర్జినిటీ కోల్పోయాను! - Sakshi

26 ఏళ్లకే వర్జినిటీ కోల్పోయాను!

బాలీవుడ్ అగ్ర దర్శకుల్లో కరణ్ జోహర్ ఒకరు. ధర్మ ప్రోడక్షన్ అధినేతగా సినిమాలు కూడా నిర్మిస్తున్న ఆయన తాజాగా ఓ ఆంగ్ల చానెల్‌ వెబ్‌సైట్‌కు రాసిన వ్యాసంలో పలు వ్యక్తిగత విషయాలు వెల్లడించారు. తాను 26 ఏళ్లకే వర్జినిటీ  కోల్పోయానని, ఇక ఎంతమాత్రం శృంగారం కోసం వెంపర్లాడటం లేదని పేర్కొన్నారు. తాను కోల్పోయిన దానిని అంగీకరించే స్థితిలో ప్రస్తుతం ఉన్నానని చెప్పారు.

‘నేను శృంగారం కోసం ఎంతమాత్రం వెంపర్లాడటం లేదు. ఆ విషయంలో ఎవరైనా నన్ను వెంటాడదలుచుకుంటే వెంటాడవచ్చు. కానీ నేను అందుకు సిద్ధంగా లేను’ అని కరణ్ అన్నారు. తనను ఓపెన్ సెక్స్‌ పార్టీ (ఓర్జీ)కి ఆహ్వానించినా.. వెళ్లేందుకు తాను తిరస్కరించినట్టు వెల్లడించారు. ‘వికారమైన వాటిని నేను ఊహించలేను. నేనొక మొద్దులాంటివాడిని. ఏం చేయాలి? ఎలా చూడాలి అన్నది నాకు తెలియదు. ఒక్కరినే నేను హ్యాండిల్ చేయలేను. అలాంటిది ఇద్దరు లేదా అంతకన్నా ఎక్కువ మందితో చేయగలనని ఎలా అనుకోగలను’ అంటూ చెప్పుకొచ్చారు.

అయినప్పటికీ తాను ఇప్పటికీ సాన్నిహిత్యాన్ని, ఏకాంతాన్ని, ముద్దులోని సౌందర్యాన్ని విశ్వసిస్తానని చెప్పారు. అయితే తనకు ఇలాంటివి చేయడం కన్నా పంచుకోవడమే ఆనందం కలిగిస్తుందని, తాను ఒంటరిగా ఉన్నా.. గొలుసులు, సంకెళ్లు, బొమ్మలు వంటి వాటితో చేయాలన్న వికారమైన కోరికలు తనకు లేవని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement