నాలుగేళ్లు కాదు ఏడేళ్లైనా ఇచ్చేవాడిని: ప్రభాస్‌ | Not four, I would have given 7 years for SS Rajamouli, says Prabhas | Sakshi

నాలుగేళ్లు కాదు ఏడేళ్లైనా ఇచ్చేవాడిని: ప్రభాస్‌

Published Mon, Apr 10 2017 10:17 AM | Last Updated on Tue, Sep 5 2017 8:26 AM

నాలుగేళ్లు కాదు ఏడేళ్లైనా ఇచ్చేవాడిని: ప్రభాస్‌

నాలుగేళ్లు కాదు ఏడేళ్లైనా ఇచ్చేవాడిని: ప్రభాస్‌

రాజమౌళి ’బాహుబలి’ కోసం నాలుగేళ్లే కాదు.. ఏడేళ్లు కావాలన్నా మరో ఆలోచన లేకుండా ఇచ్చేవాడినని ప్రభాస్‌ అన్నారు.

చెన్నై: రాజమౌళి ’బాహుబలి’ కోసం నాలుగేళ్లే కాదు.. ఏడేళ్లు కావాలన్నా మరో ఆలోచన లేకుండా ఇచ్చేవాడినని ప్రభాస్‌ అన్నారు. ’రాజమౌళి కోసం బహుబలి మీద నాలుగేళ్ల కన్నా ఎక్కువ పనిచేసేందుకు కూడా నేను సిద్ధంగా ఉండేవాదిని. ఏడేళ్లు కావాలన్నా బాహుబలి  ప్రాజెక్టు మీద పనిచేసేందుకు నేను సిద్ధమయ్యేవాడిని’  అని ప్రభాస్‌ చెప్పారు. చెన్నైలో ఆదివారం జరిగిన బాహుబలి-2 తమిళ వెర్షన్‌ ఆడియో విడుదల వేడుకలో ఆయన మాట్లాడారు.

దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మక చిత్రంగా మారిన బాహుబలిలో పనిచేసిన అనుభవంపై స్పందిస్తూ.. ’  శారీరకంగా బాగా కష్టపడాల్సి వచ్చేది. ముఖ్యంగా మొదటి పార్టులో యాక‌్షన్‌ దృశ్యాల కోసం ఎక్కువ కష్టపడ్డాను. రెండోపార్టులో రాజమౌళి యాక‌్షన్‌ సీన్లను ఎడిటింగ్‌ చేయడం వల్ల ఈ ప్రక్రియ సులభంగా మారింది’ అని చెప్పారు. తన సినిమా కోసం మూడేళ్లపాటు వేచి ఉన్న అభిమానులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. దర్శకుడు రాజమౌళి మాట్లాడుతూ ప్రభాస్‌ ఎంతో చిత్తశుద్ధి ఉన్న నటుడని, బాహుబలి పాత్రకు ప్రభాస్‌ను తప్ప వేరే ఎవరినీ ఊహించుకోలేమని అన్నారు. ఛత్రపతి సినిమా నాటి నుంచి ప్రభాస్‌తో తనకు చక్కని అనుబంధముందంటూ తన స్నేహితుడిగా ఉన్నందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. తమిళ నటుడు ధనుష్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ ఆడియో వేడుకలో పలువురు చిత్ర నటులు, యూనిట్‌ పాల్గొన్నది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement