వాషింగ్టన్: అమెరికా తన సైన్యాన్ని మరింత కాలంపాటు అఫ్గనిస్థాన్లో కొనసాగించనుంది. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఓ ప్రకటన చేశారు. మరో పద్నాలుగేళ్లపాటు తమ దేశ సైన్యాన్ని అఫ్గనిస్థాన్లో ఉంచాలని భావిస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం ఇక్కడ 9,800మంది అమెరికా సైనికులు ఉన్నారు. వీరిలో 2016 ముగిసే సమయానికి కనీసం 5,500మంది వెనుకకు రావాల్సి ఉంటుంది.
మిగతా సగం మంది 2017లోగా వచ్చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఒబామా మరోసారి తమ దేశ సైన్యాన్ని అఫ్గనిస్థాన్లో మరికొన్నేళ్లపాటు కొనసాగించాలని భావిస్తున్నట్లు స్పష్టం చేశారు. అఫ్గనిస్థాన్లో తాలిబన్ల ప్రభావం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అక్కడి ఉగ్రవాదులను అణిచివేసేందుకు తమ కార్యక్రమాలు కొనసాగుతాయని, అక్కడి ఉగ్రవాదులు మరోసారి తమ మీద దాడులకు పాల్పడితే చూడాలనుకోవడం లేదని అన్నారు. అఫ్గనిస్థాన్ ప్రస్తుతం సురక్షితంగానే ఉందని ఉగ్రవాదుల ప్రభావం లేదని తాము భావించడం లేదని అన్నారు.
'మరింతకాలం మా సైన్యం అక్కడే ఉంటుంది'
Published Fri, Oct 16 2015 10:07 AM | Last Updated on Thu, Apr 4 2019 5:12 PM
Advertisement
Advertisement