ఒబామా టాంగో డ్యాన్స్ అదుర్స్! | Obama dance tango! | Sakshi
Sakshi News home page

ఒబామా టాంగో డ్యాన్స్ అదుర్స్!

Published Fri, Mar 25 2016 1:11 AM | Last Updated on Sun, Sep 3 2017 8:29 PM

ఒబామా టాంగో డ్యాన్స్ అదుర్స్!

ఒబామా టాంగో డ్యాన్స్ అదుర్స్!

అర్జెంటీనాలో పర్యటన


బ్యూనస్ ఎయిర్స్: అర్జెంటీనా పర్యటనలో అమెరికా అధ్యక్షుడు ఒబామా దంపతులు జోరుగా హుషారుగా డాన్సులతో అదరగొట్టారు. పాశ్యాత్య నృత్యాల్లో సూపర్ డాన్స్‌గా పేరున్న టాంగో డ్యాన్స్‌తో ఒబామా, మిషెల్‌లు అక్కడి టాంగో కళాకారులతో స్టెప్పులు వేస్తూ హుషారెత్తించారు. అర్జెంటీనా డ్యాన్సర్ మోరా గాడోయ్‌తో కలసి ఒబామా నృత్యం చేశారు. ఈ డ్యాన్స్‌కు అర్జెంటీనా ప్రతిని ధులు ఫిదా అయిపోయారు.   అర్జెంటీనా సంప్రదాయ పానీయమైన ‘మేట్’ తాను తొలిసారిగా రుచిచూశానని, అర్జెం టీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీని కలుసుకునేందుకు యత్నిస్తున్నానని ఆయన చమత్కరించారు. జార్జ్ లూయిస్ బోర్జెస్, జూలియో కొర్టాజర్ వంటి అర్జెంటీనా రచయితల పుస్తకాల్ని చదివానన్నారు. ఆ దేశ ప్రతినిధులు ఇచ్చిన విందులో ఒబామా పాల్గొన్నారు.


అంతకుముందు అర్జెంటీనాలో పర్యటనలో భాగంగా ఒబామా ‘డర్టీవార్’పై ప్రసంగింస్తూ తన రాజనీతిజ్ఞతను ప్రదర్శించారు. అర్జెంటీనాలో అమెరికా మద్దతుతో జరిగిన ‘డర్టీవార్’లో చనిపోయిన వారి జ్ఞాపకార్థం నిర్మించిన బ్యూనస్‌ఎయిర్స్ సమీపంలోని ‘పరాగ్వే డె లా’ను బుధవారం ఒబామా సందర్శించారు. ఈ సందర్భంగా ‘డర్టీవార్’లో అమెరికా పోషించిన పాత్ర గురించి ఆయన మాట్లాడారు. 1976-1983 మధ్యకాలంలో జరిగిన డర్టీవార్‌లో అర్జెంటీనాకు చెందిన 30 వేలమంది కనిపించకుండా పోయారు. ‘డర్టీవార్’ఘటనల పట్ల సామరస్యాన్ని పాటించాలని.. ఇరుదేశాలమధ్య స్నేహపూర్వక సంబంధాలు కొనసాగాలని కాంక్షించారు. డర్టీవార్‌కు సంబంధించిన రహ స్య నివేదికల్ని వెల్లడించేందుకు ఒబామా అంగీకరించారు. ఈ సందర్భంగా అర్జెంటీనా అధ్యక్షుడు మార్షియో మాక్రి ‘మేమంతా డర్టీవార్ వెనుక ఉన్నటువంటి అసలు నిజాన్ని తెలుసుకోవాలనుకుంటున్నా’మన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement