
బాహుబలి నామకరణం ఖరారు!
నందన్‌కానన్‌కు పలు ప్రాంతాల నుంచి విచ్చేసే పర్యాటకులను కొత్తగా జన్మించిన పులి పిల్లలకు పేర్లను ప్రతిపాదించాలని అధికారులు కోరారు. ఈ క్రమంలో పర్యాటకులు పేర్లను ప్రతిపాదించారు. ప్రజాభిప్రాయంలో అత్యధికంగా 52 శాతం మంది బాహుబలి పేరును ప్రతిపాదించారు. ప్రజాభిప్రాయానికి పట్టం గడుతూ ఒక పులిపిల్లకు బాహుబలి పేరును ఖరారు చేశారు. మిగిలిన 6 పులి పిల్లలకు కుందన్, సాహిల్, ఆద్యాశ, చిన్ను, విక్కి, మౌసుమిగా పేరు పెట్టారు. కొత్త పులి పిల్లల్ని అంచెలంచెలుగా పర్యాటకుల సందర్శన కోసం ఎంక్లోజర్‌లో బహిరంగపరుస్తారు.