కేంద్ర ఎన్నికల కమిషనర్ గా మధ్యప్రదేశ్ మాజీ ఐఏఎస్ అధికారి ఓం ప్రకాశ్ రావత్ నియమితులయ్యారు.
న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల కమిషనర్ గా మధ్యప్రదేశ్ మాజీ ఐఏఎస్ అధికారి ఓం ప్రకాశ్ రావత్ నియమితులయ్యారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కానున్న నేపథ్యంలో ఆయనను కమిషనర్ గా నియమించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆయన బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి పదవీ కాలం అమల్లోకి వస్తుందని కేంద్ర న్యాయశాఖ గురువారం ప్రకటించింది. 2018 చివరివరకు పదవిలో కొనసాగే అవకాశముంది.
1977 బ్యాచ్ కు చెందిన రావల్ గతేడాది డిసెంబర్ లో ప్రభుత్వ సర్వీసు నుంచి రిటైర్ అయ్యారు. ఎన్నికల కమిషనర్ పదవి రాజ్యాంగబద్దమైనదని, నిష్పక్షపాతంగా పనిచేస్తానని రావత్ చెప్పారు.