
99 శాతం అవకాశం లేదు: ఒమర్ అబ్దుల్లా
శ్రీనగర్: ముఖ్యమంత్రి పదవిపై ఇక ఆశలు లేవని నేషనల్ కాన్ఫెరెన్స్ అధినేత, ప్రస్తుత కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా అన్నారు. తనను ఎమ్మెల్యేగా గెలిపించిన బీర్వా నియోజకవర్గ ప్రజలకు సేవ చేసుకుంటానని ఆయన ప్రకటించారు. బీర్వా స్థానం నుంచి విజయం సాధించడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఏర్పాటు విషయంలో 99 శాతం బీజేపీకి మద్దతు ఇచ్చే అవకాశం లేదని చెప్పారు.
సోనావార్ స్థానంలోనూ పోటీ చేసిన ఆయన అక్కడ ఓటమి పాలయ్యారు. సోనావార్ లో తనపై గెలిచిన పీడీపీ అభ్యర్థి మహ్మద్ అష్రాఫ్ మిర్ ను ఆయన అభినందించారు. ఆరేళ్ల పాటు నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషించేందుకు సిద్దమన్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఎవరూ సంప్రదించలేదని ఒమర్ అబ్దుల్లా తెలిపారు.