
హనుమంతరావు ప్లీజ్ గో బ్యాక్..
న్యూఢిల్లీ : ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ వ్యవహారం 'లలిత్ గేట్'పై చర్చ జరగాలని విపక్ష సభ్యులు బుధవారం రాజ్యసభలో ఆందోళనకు దిగారు. అందుకు డిప్యూటీ ఛైర్మన్ పీజే కురియన్ ససేమిరా అన్నారు. దాంతో విపక్ష సభ్యులు ప్లకార్డులతో వెల్లోకి దూసుకువెళ్లి... పెద్ద పెట్టున నినాదాలు చేశారు. దయ చేసి వెనక్కి వెళ్లి సీట్లలో కూర్చోవాలని పీజే కురియన్ సభ్యులకు విజ్ఞప్తి చేశారు. అంతా వెనక్కి వెళ్తున్న తెలంగాణకు చెందిన కాంగ్రెస్ పార్టీ సభ్యుడు వి.హనుమంతరావు అక్కడే ఉండి పెద్ద పెట్టున్న నినాదాలు చేస్తున్నారు.
దాంతో పీజే కురియన్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ హనుమంతరావు ప్లీజ్ గో బ్యాక్ అంటూ పలుమార్లు విజ్ఞప్తి చేశారు. దీంతో వీహెచ్ సీట్లోకి వెళ్లారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు మంగళవారం ప్రారంభమైన సంగతి తెలిసిందే. సభలు ప్రారంభమైన నాటి నుంచి అధికార పార్టీకి లలిత్ మోదీ వ్యవహారంలో కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ రాజీనామా చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.