‘ఆహార భద్రత’కు పార్లమెంటు ఆమోదం | Parliament passes food bill for 800 million people | Sakshi
Sakshi News home page

‘ఆహార భద్రత’కు పార్లమెంటు ఆమోదం

Published Tue, Sep 3 2013 5:28 AM | Last Updated on Fri, Sep 1 2017 10:24 PM

Parliament passes food bill for 800 million people

 న్యూఢిల్లీ: యూపీఏ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఆహార భద్రత బిల్లు పార్లమెంటు ఆమోదం పొందింది. దేశంలోని మూడింట రెండొంతుల జనాభాకు సబ్సిడీ ధరలకు ఆహార ధాన్యాలను సరఫరా చేసే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ఈ బిల్లును సోమవారం రాజ్యసభ మూజువాణీ ఓటుతో ఆమోదించింది. దాదాపు 82 కోట్ల జనాభాకు లబ్ధి చేకూర్చే ఈ బిల్లు చట్టంగా మారేందుకు ఇక రాష్ట్రపతి ఆమోదం మాత్రమే పొందాల్సి ఉంది.   ఆహార భద్రత కోసం జూలై 5న ప్రభుత్వం అమలులోకి తెచ్చిన ఆర్డినెన్స్ రద్దు కోసం ప్రవేశపెట్టిన తీర్మానంపై చర్చ అనంతరం రాజ్యసభ ఈ బిల్లును ఆమోదించింది. అయితే, విపక్షాలు ప్రతిపాదించిన సవరణలను గతవారం లోక్‌సభ ఆమోదించగా, రాజ్యసభ ఆ సవరణలను తిరస్కరించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement