
పవన్ కల్యాణ్ కు అరుదైన అవకాశం!
పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభిమానులు సంతోషపడే వార్త ఇది. ‘ఇండియన్ కాన్ఫరెన్స్ 2017’ తన అభిప్రాయాలను పంచుకునేందుకు హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుంచి ఆహ్వానం అందిందట. ఫిబ్రవరి లో జరగనున్న ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ కూడా హాజరు కానున్నారని తెలుస్తోంది.
బోస్టన్ లోని హార్వార్డ్ యూనివర్శిటీలో జరిగే 'ఇండియా కాన్ఫరెన్స్ 2017'లో పవన్ పాల్గొననున్నారు. ఫిబ్రవరి 11 నుంచి రెండు రోజుల పాటు సాగే ఈ సమావేశాల్లో పవన్ ప్రసంగించనున్నారు. దీంతో తమ అభిమాన హీరోకు లభించిన ఈ అరుదైన అవకాశం వార్తలతో సోషల్ మీడియాలో పవన్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ట్విట్టర్ లో పవన్ కు అభినందనల వెల్లువ సాగుతోంది.
కాగా ప్రస్తుతం 'కాటమరాయుడు' చిత్రం ఫైనల్ షెడ్యూల్ చిత్రీకరణలో గబ్బర్ సింగ్ బిజీగా ఉన్నాడు. సమ్మర్ రిలీజ్ కు సిద్ధమవుతున్న ఈ మూవీ షూటింగ్ జోరుగా సాగుతున్న సంగతి తెలిసిందే.
#PawanKalyan will be speaking at Harvard University, Boston in February as part of #IndiaConference2017
— Haricharan Pudipeddi (@pudiharicharan) January 16, 2017