
ఉద్దానం కిడ్నీరోగులకు ఏం చేస్తారు?
ఇచ్చాపురం పర్యటనలో ప్రభుత్వాన్ని ప్రశ్నించిన పవన్ కల్యాణ్
సాక్షి ప్రతినిధి శ్రీకాకుళం: గోదావరి, కృష్ణా పుష్కరాలకు వేల కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వం.. శ్రీకాకుళం జిల్లా లోని ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ రోగులను ఆదుకునేందుకు నిధులు కేటాయించకపోవడం శోచనీయమ ని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. కిడ్నీ రోగులను ఆర్థికంగా, వైద్యప రంగా ఆదుకు నేందుకు ప్రభుత్వం ఎటువం టి చర్యలు తీసుకుంటుందో తెలియజేయాలన్నారు.
(చదవండి : స్పందించకుంటే ఉద్యమమే )
శ్రీకాకుళం జిల్లాలోని కంచిలి, కవిటి, సోంపేట, పలాస, వజ్రపుకొత్తూరు మండలాల్లో విస్తరించివున్న ఉద్దానం ప్రాం తం నుంచి దాదాపు 200 మంది కిడ్నీ రోగులను మంగళవారం ఉదయం జనసేన కార్యకర్తలు బస్సుల్లో ఇచ్ఛాపురంలోని ఎల్ మాక్స్ థియేటర్‌కు తీసుకొచ్చారు. విశాఖపట్నం నుంచి రోడ్డు మార్గంలో ఇచ్ఛాపురం చేరుకున్న పవన్ కల్యాణ్ కిడ్నీ రోగులు, వైద్యులతో మాట్లాడి ఉద్దానం ప్రాంతంలో వ్యాధి పరిస్థితి తెలుసుకున్నారు. 20 ఏళ్లుగా ప్రజలు కిడ్నీ వ్యాధులతో సతమతమవుతుంటే స్థానిక ప్రజాప్రతినిధులు ఈ అంశాన్ని చట్టసభల్లో లేవనెత్తి ఎందుకు పరిష్కరించలేకపోయారో అర్థం కావట్లేదన్నారు. ఉద్దానం ప్రాంతంలో పర్యటించి నివేదిక సమర్పించేందుకు డాక్టరు హరిప్రసాద్ నేతృత్వంలో పార్టీ కమిటీ నియమిస్తున్నట్లు ప్రకటించారు.