నల్లకుబేరులకు మరోసారి గట్టి హెచ్చరిక | People converting black money into white not to be spared:Govt | Sakshi
Sakshi News home page

నల్లకుబేరులకు మరోసారి గట్టి హెచ్చరిక

Published Fri, Dec 2 2016 11:53 AM | Last Updated on Wed, Apr 3 2019 5:16 PM

People converting black money into white not to be spared:Govt

న్యూఢిల్లీ: నల్లకుబేరులకు ఆర్థికమంత్రిత్వ శాఖ మరోసారి గట్టి వార్నింగ్ ఇచ్చింది. పెద్దనోట్ల రద్దు తరువాత భారీ ఎత్తున జ‌రుగుతున్న అక్రమాల నేప‌థ్యంలో  మనీ లాండరింగ్‌కు పాల్పడితే క‌ఠిన చ‌ర్యలు తప్పని గురువారం హెచ్చరించింది.  ఆ మేరకు ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శ‌క్తికాంత దాస్  ట్విట్టర్   ద్వారా కఠిన హెచ్చరికను జారీ చేశారు.

అక్రమంగా నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకుంటున్న వారిని ఉపేక్షించేదిలేదని హెచ్చరించారు. ఈ మేరకు వివిధ చట్ట ఏజెన్సీల సమన్వయంతో పనిచేస్తున్నట్టు చెప్పారు.  అక్రమ లావాదేవీలపై నిఘా ఉంచామ‌ని ఇప్పటికే ప‌లువురిపై కేంద్ర ప్రభుత్వం  చర్యలు తీసుకుంటోంద‌ని  తెలిపారు. ఆదాయ‌ ప‌న్ను శాఖ  దాడుల్లో  భారీ ఎత్తున డ‌బ్బును స్వాధీనం చేసుకుంటున్నట్టు ప్రకటించిన ఆయన  ఆ దాడులు ఇంకా కొనసాగుతాయన్నారు.
కాగా  నల్లధనంపై  ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ కఠినమైన ఆదేశాలు జారీచేశారు. స్వచ్ఛందంగా ప్రకటిస్తే 50 శాతం పెనాల్టీ,  ఆదాయ పన్ను అధికారుల దాడుల్లో దొరికితే , జరిమానా, పన్ను కలిసి 85 శాతం చెల్లించాల్సిన స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement