
మన విజయాల గురించి చెప్పండి: మోదీ
న్యూఢిల్లీ: పార్లమెంట్ లో ప్రభుత్వం ఆమోదించిన బిల్లుల గురించి ప్రజలకు తెలపాలని బీజేపీ ఎంపీలను ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. ప్రభుత్వం సాధించిన విజయాలను బాగా ప్రచారం చేయాలని సూచించారు. బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మంగళవారం మోదీ మాట్లాడారు.
లోక్సభ, రాజ్యసభలో ప్రభుత్వం ఆమోదించిన బిల్లుల గురించి ప్రజలకు వివరించాలని ఎంపీలను కోరారు. రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. విపక్షాల వలలో పడకుండా అభివృద్ధి పనులు, సుపరిపాలనపై దృష్టి పెట్టాలని మోదీ సూచించారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నాటికి ఎంపీలు విషయవగాహన మరింత పెంచుకోవాలన్నారు.