మరో15 దేశాల్లో అఫీషియల్ గా 'పోకిమాన్ గో'
మరో15 దేశాల్లో అఫీషియల్ గా 'పోకిమాన్ గో'
Published Sat, Aug 6 2016 4:22 PM | Last Updated on Mon, Sep 4 2017 8:09 AM
బ్యాంకాక్: ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆసక్తికరంగా మారిన పోకిమాన్ గో గేమ్ మరో మైలు రాయిని అధిగమించింది. జీపీఎస్ ఆధారిత అగ్మెంటెడ్ గేమ్ ఆసియా-పసిఫిక్ లోని మరో 14 ఇతర దేశాలతో పాటు థాయిలాండ్ లో కూడా అధికారికంగా శనివారం ప్రారంభమైంది. ఆసియా అండ్ ఓషియానియా అంతటా గేమర్స్ ఆండ్రాయిడ్ ప్లే స్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్ ద్వారా పోకీమాన్ గో ఇప్పుడు అధికారికంగా గేమ్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చని బ్యాంకాక్ పోస్ట్ ఒక ప్రకటన లో తెలిపింది.
బ్రూనే, కంబోడియా, ఇండోనేషియా, లావోస్, మలేషియా, ఫిలిప్పీన్స్, సింగపూర్, వియత్నాం, తైవాన్, పాపువా న్యూ గినియా, ఫిజి, సోలమన్ దీవులు, మైక్రోనేషియా, పలావు ఫెడరేటెడ్ స్టేట్స్ లో ఇక పోకిమాన్ గో సందడి అధికారికంగా మొదలైందని నియాంటిక్ ఒక ప్రకటన లో తెలిపింది.
ఈ పోకిమాన్ గో ఆటను నియంత్రించే అంశాలపై పరిశీలిస్తోందని థాయిలాండ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐసీటీ)మంత్రిత్వ శాఖ ఇటీవల వెల్లడించింది. అయితే పర్యాటకులకోసం, గేమ్ డెవలపర్లను ప్రోత్సహించే ప్రయత్నంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు పర్యాటక శాఖ మంత్రి ప్రకటించారు. మరోవైపు బ్యాంకాక్ పోస్ట్ అందించిన సమాచారం ప్రకారం దేవాలయాలు, పురాతన ప్రదేశాల దగ్గర పోకిమాన్ గో ఆటగాళ్లు నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే ఐసీటీ మంత్రిత్వ శాఖకు సమాచారం అందిస్తామని కల్చరల్ మినిస్ట్రీ హెచ్చరించింది. కాగా థాయిలాండ్ లో, ఈ ఆట ప్రయోగ వార్తలపై అధికారులు మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతుండడం విశేషం.
Advertisement