
టీచర్‌గా రాష్ట్రపతి!
న్యూఢిల్లీ: ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ స్కూలు విద్యార్థులకు పాఠాలు చెప్పనున్నారు. రాష్ట్రపతి ఎస్టేట్‌లోని రాజేంద్ర ప్రసాద్ సర్వోదయ విద్యాలయలో సెప్టెంబర్ 4న ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 1 వరకూ బోధించేందుకు రాష్ట్రపతి అంగీకరించారని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా తెలిపారు. సీఎం అరవింద్ కేజ్రీవాల్, తాను ఇటీవల రాష్ట్రపతిని కలసివిజ్ఞప్తి చేయగా, ఆయన అంగీకరించారన్నారు. ఉపాధ్యాయుల గౌరవార్థం పాఠాలు బోధించాలన్న తమ ప్రభుత్వ ప్రతిపాదన రాష్ట్రపతికి నచ్చిందన్నారు.
టీచర్స్ డే రోజున దేశ ప్రథమ పౌరుడు ఇలా ఒక ఉపాధ్యాయుడిగా పనిచేయడం కన్నా మించిన గౌరవం టీచర్లకు ఉండబోదన్నారు. అదేవిధంగా తమ ప్రభుత్వం ‘బీ ఏ టీచర్’ పేరుతో ఓ కార్యక్రమం ప్రారంభించనుందన్నారు.