రఫల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం మే నెలలో ఎప్పుడైనా ప్రారంభమయ్యే అవకాశం ఉందని రక్షణశాఖ మంత్రి మనోహర్ పారికర్ తెలిపారు.
న్యూఢిల్లీ: రఫల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం మే నెలలో ఎప్పుడైనా ప్రారంభమయ్యే అవకాశం ఉందని రక్షణశాఖ మంత్రి మనోహర్ పారికర్ తెలిపారు. త్వరలోనే దీనిని పూర్తి చేసి భారత వైమానికి దళంలో ప్రవేశ పెడతామని చెప్పారు. గత పదిహేడేళ్లుగా ఈ విమానాల కొనుగోలు విషయంలో తర్జన భర్జనలు చేయడం తప్ప ఇంతవరకు ఎలాంటి తుది నిర్ణయం తీసుకుంది లేదు.
అయితే, భారత వాయుసేన అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఫ్రాన్స్ నుంచి రఫల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేస్తున్నట్లు ఫ్రాన్స్ పర్యటనలో ఉన్నప్పుడు ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించారు. 126, రఫల్ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించి మూడేళ్లుగా భారత్, ఫ్రాన్స్‌ల మధ్య జరుగుతున్న చర్చల్లో అధిక ధరపై ప్రతిష్టంభన ఏర్పడగా అది ప్రధాని పర్యటన నేపథ్యంలో దానికి తెరపడింది.