
రహానే మెరుపులు.. రాహుల్ చెప్పిన సీక్రెట్ ఇదే!
ధర్మశాల టెస్టులో నాలుగో రోజు నిలకడగా ఆడిన కేఎల్ రాహుల్ అజేయంగా 51 పరుగులు చేసి..
ధర్మశాల టెస్టులో నాలుగో రోజు నిలకడగా ఆడిన కేఎల్ రాహుల్ అజేయంగా 51 పరుగులు చేసి.. టీమిండియాను విజయతీరాన్ని చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే, కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్ కంటే.. తాత్కాలిక కెప్టెన్ అజింక్యా రహానే మెరుపులే నాలుగోరోజు హైలెట్‌గా నిలిచాయి. దూకుడుగా చెలరేగి ఆడిన రహానే 27 బంతుల్లో 38 పరుగులు చేసి అందరినీ విస్మయంలో ముంచెత్తాడు.
టెక్నికల్‌గా మంచి బ్యాట్స్‌మన్‌గా పేరొందిన రహానే.. టెస్టుల్లో చెలరేగింది ఆడింది పెద్దగా లేదు. నిలకడగా, నిదానంగా ఆడటమే అతని శైలి. మరీ, అతను ఇలా ఎందుకు చెలరేగిపోయాడు.. నాలుగు ఫోర్లు, రెండు భారీ సిక్సర్లతో ఎందుకు రూటు మార్చాడు అంటే మరో ఎండ్‌లో బ్యాటింగ్ చేస్తున్న కేఎల్ రాహుల్ ఓ విషయాన్ని చెప్పాడు. 'జింక్స్ (రహానే ముద్దుపేరు) వచ్చీరాగానే కమిన్స్ బౌలింగ్‌లో సిక్సర్లు బాదడం అద్భుతంగా అనిపించింది. అతను నా వద్దకు వచ్చి 'ఇక నేను డామినేట్ చేస్తా' అని చెప్పాడు' అని రాహుల్ మీడియాకు తెలిపాడు. రాహుల్‌కు చెప్పినట్టే కెప్టెన్‌గా రహానే బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం ఐదు బంతుల తేడాలో ఓపెనర్ మురళీ విజయ్, పరుగుల మిషిన్ ఛటేశ్వర్ పూజారా వికెట్లు పడిపోయిన నేపథ్యంలో రహానే చెలరేగి ఆడటం టీమిండియాలో, భారత ప్రేక్షకుల్లో కొత్త జోష్ నింపింది.