India versus Australia
-
ఓటమికి మేం అర్హులమే: స్టీవ్ స్మిత్ షాకింగ్ కామెంట్స్!
భారత్‌తో జరిగిన ప్రతిష్టాత్మక వన్డే సిరీస్‌ను 1-4 తేడాతో కోల్పోవడంపై ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఒకింత నిర్వేదంగా స్పందించాడు. సిరీస్‌లో ఈ పరాభవానికి తాము అర్హులమేనని పేర్కొన్నాడు. ఇకనుంచి రాబోయే సిరీస్‌లలోనైనా స్థిరమైన ఆటతీరుతో రాణించాల్సిన అవసరముందని చెప్పాడు. నాగ్‌పూర్‌లో జరిగిన ఐదో వన్డేలో ఆసీస్ విసిరిన 243 పరుగుల లక్ష్యాన్ని భారత్ సునాయసంగా ఛేదించింది. రోహిత్ శర్మ సెంచరీ సాధించి సత్తా చాటడంతో 43 బంతులు ఉండగానే భారత్ విజయాన్ని అందుకొని.. 4-1తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన తమ జట్టు 50-60 పరుగులు తక్కువ రాబట్టడం వల్లే ఓటమిపాలైందని, నాగపూర్ వికెట్‌పై 300లకుపైగా పరుగులు చేస్తే తమకు విజయ అవకాశాలు ఉండేవని స్మిత్ చెప్పుకొచ్చాడు. ' 300 పరుగులు చేస్తే బాగుండేది. మా టాప్ ఫోర్ బ్యాట్స్‌మెన్‌లో ఒకరు భారీ స్కోరు చేసి ఉండాల్సింది. వరుసగా వికెట్లు కోల్పోయాం. ఇకనుంచైనా మమ్మల్ని మేం మెరుగుపరుచుకొని స్థిరమైన ఆటతీరు కనబర్చాల్సి ఉంది. స్థిరమైన ఆటతీరుకు అనుగుణమైన సమన్వయాన్ని మేం సాధించాలి. ఆటలో మమ్మల్ని చిత్తుచేశారు. 4-1 తేడాతో సిరీస్ ఓటమికి మేం అర్హులమే' అని 28 ఏళ్ల స్మిత్ అన్నాడు. ఇండియాలో తమ ఆటగాళ్లు ఎంతో క్రికెట్ ఆడారని, అయినా దానిని ఓటమికి సాకుగా చూపబోనని చెప్పాడు. సానుకూల దృక్పథంతో సాగేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిపాడు. భారత క్రికెట్ జట్టు చాలా బాగా ఆడిందని, జట్టు సభ్యుల మధ్య మంచి సమన్వయం ఉందని స్మిత్ కితాబిచ్చాడు. టీ-20 సిరీస్ ప్రారంభానికి ఇంకా ఆరురోజుల సమయం ఉందని, బాగా ఆడి కనీసం ఈ ట్రోఫీని ఇంటికి తీసుకెళుతామని స్మిత్ ఆశాభావం వ్యక్తం చేశాడు. -
రహానే మెరుపులు.. రాహుల్ చెప్పిన సీక్రెట్ ఇదే!
ధర్మశాల టెస్టులో నాలుగో రోజు నిలకడగా ఆడిన కేఎల్ రాహుల్ అజేయంగా 51 పరుగులు చేసి.. టీమిండియాను విజయతీరాన్ని చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే, కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్ కంటే.. తాత్కాలిక కెప్టెన్ అజింక్యా రహానే మెరుపులే నాలుగోరోజు హైలెట్‌గా నిలిచాయి. దూకుడుగా చెలరేగి ఆడిన రహానే 27 బంతుల్లో 38 పరుగులు చేసి అందరినీ విస్మయంలో ముంచెత్తాడు. టెక్నికల్‌గా మంచి బ్యాట్స్‌మన్‌గా పేరొందిన రహానే.. టెస్టుల్లో చెలరేగింది ఆడింది పెద్దగా లేదు. నిలకడగా, నిదానంగా ఆడటమే అతని శైలి. మరీ, అతను ఇలా ఎందుకు చెలరేగిపోయాడు.. నాలుగు ఫోర్లు, రెండు భారీ సిక్సర్లతో ఎందుకు రూటు మార్చాడు అంటే మరో ఎండ్‌లో బ్యాటింగ్ చేస్తున్న కేఎల్ రాహుల్ ఓ విషయాన్ని చెప్పాడు. 'జింక్స్ (రహానే ముద్దుపేరు) వచ్చీరాగానే కమిన్స్ బౌలింగ్‌లో సిక్సర్లు బాదడం అద్భుతంగా అనిపించింది. అతను నా వద్దకు వచ్చి 'ఇక నేను డామినేట్ చేస్తా' అని చెప్పాడు' అని రాహుల్ మీడియాకు తెలిపాడు. రాహుల్‌కు చెప్పినట్టే కెప్టెన్‌గా రహానే బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం ఐదు బంతుల తేడాలో ఓపెనర్ మురళీ విజయ్, పరుగుల మిషిన్ ఛటేశ్వర్ పూజారా వికెట్లు పడిపోయిన నేపథ్యంలో రహానే చెలరేగి ఆడటం టీమిండియాలో, భారత ప్రేక్షకుల్లో కొత్త జోష్ నింపింది. -
టీమిండియా టెస్టు కెప్టెన్‌గా అతనే కరెక్ట్!
కీలకమైన నాలుగో టెస్టులో ఆస్ట్రేలియాను ఎనిమిది వికెట్ల తేడాతో భారత్ మట్టికరిపించి.. సిరీస్‌ను చేజిక్కించుకోవడంతో.. ఈ టెస్టులో టీమిండియాకు సారథ్యం వహించిన అజింక్యా రహానేపై ప్రశంసల జల్లు కురుస్తోంది. టీమిండియా టెస్టు కెప్టెన్సీ పగ్గాలను రహానేకు అప్పగిస్తే బాగుంటుందని ఆస్ట్రేలియా మాజీ పేస్ బౌలర్ మిచెల్ జాన్సన్ అభిప్రాయపడ్డారు. 'కెప్టెన్‌గా రహానేను కొనసాగించాలి. ఇది చాలా కఠినమైన సిరీస్. అయినా ఈ సిరీస్ ఆటగాళ్ల ప్రతిభతో బాగా సాగింది' అని జాన్సన్ ట్విట్టర్లో అభిప్రాయపడ్డారు. కెప్టెన్ విరాట్ కోహ్లికి రాంచీ టెస్టులో భుజానికి గాయం కావడంతో అతను నాలుగో టెస్టు నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ధర్మశాల టెస్టుకు నాయకత్వం వహించిన రహానే మైదానంలో తన బాధ్యతలను చక్కగా నిర్వర్తించాడు. రెండో ఇన్నింగ్స్‌లో శరవేగంగా 38 పరుగులు చేశాడు. ఓపెనర్ లోకేశ్ రాహుల్ కూడా ఈ సిరీస్‌లో ఆరో అర్ధ సెంచరీ సాధించడంతో భారత్ ఎనిమిది వికెట్ల తేడాతో విజయాన్ని సాధించి బోర్డర్-గవస్కర్ ట్రోఫీని 2-1తో సొంతం చేసుకుంది. అయితే, వాడీవేడిగా జరిగిన ఈ సిరీస్ నేపథ్యంలో ఆసీస్ ఆటగాళ్లను తాను స్నేహితులుగా పరిగణించబోనంటూ కెప్టెన్ కోహ్లి కామెంట్ చేశాడు. ఈ నేపథ్యంలో కోహ్లికి కౌంటర్ ఇచ్చేందుకు జాన్సన్ ఈ వ్యాఖ్యలు చేశాడా? అని పరిశీలకులు భావిస్తున్నారు. -
క్రికెటర్ విజయ్‌ని స్మిత్ దారుణంగా తిట్టాడా?
ప్రస్తుతం కొనసాగుతున్న బోర్డర్-గవస్కర్ ట్రోఫీలో వివాదాలకు అడ్డే లేకుండా పోయింది. ప్రపంచంలో మేటి జట్లుగా పేరొందిన భారత్-ఆస్ట్రేలియా మధ్య టెస్టు సిరీస్ అంటే సహజంగానే మైదానంలో హోరాహోరీ పోరు ఉంటుందని అందరూ భావించారు. అందుకు తగ్గట్టే ప్రస్తుత సిరీస్‌లో ఇరుజట్లు ధాటిగా తలపడుతున్నప్పటికీ.. ఎడతెరిపి లేకుండా కొనసాగుతున్న వివాదాలు మాత్రం ఇరు జట్లను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. స్లెడ్జింగ్‌కు తోడు ఆస్ట్రేలియా సారథి స్టీవ్ స్మిత్ 'డీఆర్ఎస్ వివాదం' సిరీస్‌ను కుదిపేసింది. డీఆర్ఎస్ రివ్యూ కోసం స్మిత్ డ్రెసింగ్ రూమ్ సలహాలు తీసుకోవడం పెద్ద దుమారమే రేపింది. ఇక రాంచీ టెస్టులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి భుజానికి గాయమవ్వగా.. ఆసిస్ ఆటగాడు గ్లెన్ మ్యాక్స్‌వెల్ కోహ్లిని వెక్కిరించేలా అనుకరించడం వివాదం రేపింది. తాజాగా ధర్మశాలలో జరుగుతున్న నాలుగో టెస్టులో ఆసీస్ కెప్టెన్ స్మిత్.. విజయ్ను దారుణంగా దుర్భాషలాడటం వివాదం రేపుతోంది. సిరీస్ ఎవరిదో తేల్చే నాలుగు టెస్టు మూడో రోజు సోమవారం.. జోష్ హజెల్‌వుడ్ బ్యాటుకు తగిలి వచ్చిన బంతిని స్లిప్‌లో ఉన్న మురళీ విజయ్ క్యాచ్ పట్టాడు. భారత ఆటగాళ్లు కాన్ఫిడెంట్‌గా అప్పీల్ చేశారు. దీంతో ఎటూ తేల్చుకోలేకపోయిన ఎంపైర్లు.. థర్డ్ ఎంపైర్‌కు నివేదించారు. థర్డ్ ఎంపైర్ మాత్రం బ్యాట్స్‌మన్‌కు ఫేవర్‌గా నిర్ణయాన్ని వెలువరించాడు. హజెల్‌వుడ్ ఔటైతే తాను బ్యాటింగ్‌కు దిగాల్సి ఉండటంతో అందుకు సిద్ధమవుతూ కనిపించిన స్మిత్.. థర్డ్ ఎంపైర్ నిర్ణయం నేపథ్యంలో ఆగ్రహంగా స్పందిస్తూ.. విజయ్ను ఉద్దేశించి (ఫ.. చీట్) అంటూ దారుణంగా నోరుపారేసుకున్నాడు. డ్రెసింగ్ రూమ్‌లో అతని ఆగ్రహం, దుర్భాషలాడటం కెమెరా కంటికి చిక్కింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది. స్మిత్ తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి హజెల్‌వుడ్ నాటౌట్ నిర్ణయం పెద్దగా మ్యాచ్‌పై ప్రభావం చూపలేదు. అశ్విన్ బౌలింగ్‌లో ఆ తర్వాత బంతికే హజెల్‌వుడ్ ఔటయ్యాడు. రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 137 పరుగులకే చాపచుట్టేయడంతో 106 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా విజయం దిశగా దూసుకుపోతున్నది. In response to @BenHorne8 tweet. This is the video. pic.twitter.com/TiiClKS1BH — Neroli Meadows (@Neroli_M_FOX) March 27, 2017 -
విరాట్ కోహ్లికి గాయం!
-
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా
-
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా
రాంచీ: బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో మరో రసవత్తర పోరుకు తెరలేచింది. రాంచీలో భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్టు ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. నాలుగు టెస్టుల సిరీస్ ప్రస్తుతం 1-1తో సమం కావడంతో ఈ టెస్టు అత్యంత కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో జార్ఖండ్ క్రికెట్ సంఘం స్టేడియంలో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌పై అందరి దృష్టి నెలకొంది. తొలి టెస్టులో చిత్తుగా ఓడిన భారత్, రెండో టెస్టులో ఘన విజయం సాధించి మళ్లీ రేసులోకి దూసుకొచ్చింది. గత మ్యాచ్ పరాజయం తర్వాత కోలుకునే ప్రయత్నంలో ఉన్న ఆసీస్ కూడా మ్యాచ్ కోసం బాగా సన్నద్ధమైంది. మ్యాచ్‌కు ముందురోజు రెండు జట్ల కెప్టెన్లు మ్యాచ్ రిఫరీ రిచీ రిచర్డ్సన్ను కలిశారు.