
'దివ్యమైన రూపంతో రామమందిరం నిర్మిస్తాం'
ఉన్నవ్(యూపీ): బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్ వివాదస్పద వ్యాఖ్యల పరంపర కొనసాగిస్తున్నారు. తాజాగా అయోధ్యలో రామాలయం నిర్మాణం గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. 2019 లోక్ సభ ఎన్నికల ముందు నాటికి అయోధ్యలో రామమందిరం నిర్మాణం పూర్తవుతుందని చెప్పారు. దివ్యమైన రూపంతో మందిరాన్ని నిర్మిస్తామని పేర్కొన్నారు.
గతంలో అయోధ్యలో రామమందిరం ఉండేదని, భవిష్యత్తులోనూ అది ఉంటుందని అన్నారు. రామమందిరం నిర్మాణం అనేది బీజేపీకి సంబంధించిన విషయం కాదని, సాధువులుగా ఆ బాధ్యత తమపై ఉందని విలేకరులతో చెప్పారు. గతంలో మందిర ఉద్యమానికి మద్దతు తెలపాలని అన్ని రాజకీయ పార్టీలను కోరామని, బీజేపీ మాత్రమే తమకు దన్నుగా నిలిచిందని తెలిపారు.