అహ్మదాబాద్: దేశ అమృత కాలపు ఆరంభంలోనే అయోధ్యలో రామాలయ ప్రతిష్టాపన జరగనుండటం యాదృచ్చికమేమీ కాదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా శనివారం అభిప్రాయపడ్డారు. రానున్న పాతికేళ్లలో ప్రపంచంలో భారత్ అగ్ర స్థానానికి చేరి పునర్వైభవం సాధించనుందనేందుకు ఇది తార్కాణమన్నారు.
వందల ఏళ్ల ఎదురు చూపులు ఫలించాయి. దేశవాసుల ప్రార్థనలు, సాధు సంతుల తపస్సులు, అసంఖ్యాత భక్తుల ప్రయత్నాలు ఫలించాయి. అడ్డంకులన్నీ తొలగాయి. శ్రీరాముడు తన జన్మస్థానంలో ఎట్టకేలకు వైభవంగా కొలువు దీరనున్నాడు’’ అని అన్నారు. అయోధ్య మాత్రమే గాక కాశీలో నాడు ఔరంగజేబ్ ధ్వంసం చేసిన విశ్వనాథ్ కారిడార్‌ను కూడా మోదీ ప్రభుత్వం బ్రహా్మండంగా పునర్నిర్మించిందని గుర్తు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment