
ములాయం రామమందిరం కడతారా?
ఉన్నవ్(యూపీ): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం హయాంలోనే అయోధ్యలో రామ మందిరం నిర్మిస్తామని వివాదస్పద ఎంపీ సాక్షి మహరాజ్ అన్నారు. కేంద్ర ప్రభుత్వానికి నాలుగేళ్ల సమయం ఉన్నందున ఎప్పుడైనా మందిర నిర్మాణం జరగొచ్చని చెప్పారు.
'రామమందిరం నిర్మాణం బీజేపీ హయంలో జరగకపోతే కాంగ్రెస్ పాలనలో మందిర నిర్మాణం సాకారమవుతుందా? ములాయం లేదా మాయావతి కడతారా? బీజేపీ పాలనలోనే రామమందిరం నిర్మిస్తాం. ఈరోజు కాకపోతే రేపు. రేపు కాకపోతే తర్వాత రోజు. మా ప్రభుత్వానికి ఏడాది మాత్రమే పూర్తయింది. ఇంకా నాలుగేళ్లు అధికారంలో ఉంటాం' అని సాక్షి మహరాజ్ అన్నారు. మోదీ ప్రభుత్వం అభివృద్ధి అజెండాతోనే అధికారంలోకి రాలేదని కాషాయ అజెండాతో 'పవర్'లోకి వచ్చిందని వెల్లడించారు.