36 ఏళ్ల రికార్డు బద్దలు! | Rather's defeat ends record 36-year stint in JK Assembly | Sakshi
Sakshi News home page

36 ఏళ్ల రికార్డు బద్దలు!

Published Tue, Dec 23 2014 2:26 PM | Last Updated on Tue, Aug 14 2018 5:54 PM

36 ఏళ్ల రికార్డు బద్దలు! - Sakshi

36 ఏళ్ల రికార్డు బద్దలు!

శ్రీనగర్: జమ్మూకశ్మీర్ ఆర్థిక మంత్రి అబ్దుల్ రహీం రాథర్ రికార్డు బద్దలయింది. 36 ఏళ్లుగా శాసనసభ సభ్యుడిగా కొనసాగుతున్న ఆయన తాజా ఎన్నికల్లో ఓడిపోయారు. సెంట్రల్ కశ్మీర్ లోని చరార్-ఈ-షరీఫ్ అసెంబ్లీ స్థానానికి 36 ఏళ్లుగా ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన ఇప్పుడు అదే స్థానం నుంచి పరాజయం పాలయ్యారు.

నేషనల్ కాన్ఫెరెన్స్(ఎన్ సీ) అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన పీడీపీ అభ్యర్థి, శాసనమండలి మాజీ చైర్మన్ గులాం నబీ లోన్ చేతిలో కంగుతిన్నారు. 5 వేల పైచిలుకు ఓట్ల తేడాతో ఓడిపోయారు. రాథర్ పై గత రెండు ఎన్నికల్లో పోటీ చేసిన గులాం నబీ లోన్ ఓడిపోయారు. మూడో పర్యాయం ఆయనకు అదృష్టం కలిసొచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement