జయలలితతో రవిశంకర్ ప్రసాద్ భేటీ
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ గురువారం కలిశారు. ఆమెతో చర్చలు జరిపిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రధానమంత్రి జనధన యోజన గురించి జయలలితకు వివరించినట్టు మంత్రి తెలిపారు. ఈ పథకం వల్ల ప్రజలకు కలిగే ఆర్థిక ప్రయోజనాల గురించి కూడా చెప్పానని అన్నారు.
ప్రధానమంత్రి జనధన యోజన పథకాన్ని ఈ సాయంత్రం ప్రధాని నరేంద్ర మోడీ ఢిల్లీలో ప్రారంభించారు. 'డిజిటల్ ఇండియా' కార్యక్రమం ద్వారా సాంకేతిక ఫలితాలు సామాన్యులకు అందుబాటులోకి తెస్తామని రవిశంకర్ ప్రసాద్ తెలిపారు.