న్యూఢిల్లీ : రాష్ట్ర విభజన నేపధ్యంలో రాయలసీమ కాంగ్రెస్ నేతలు తమ అభిప్రాయాలు, సమస్యలు వినిపించేందుకు పార్టీ అధినేత్రి సోనియాగాంధీ అపాయింట్మెంట్ కోరారు. ఒకవేళ విభజన అనివార్యమైన నేపథ్యంలో సీమ నేతలు ....రాయల తెలంగాణ వైపు మొగ్గు చూపుతూ ఆవైపుగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో మంగళవారం కర్నూలు, అనంతపురం కాంగ్రెస్ నేతలు మంగళవారం ఎంపీ సాయి ప్రతాప్ నివాసంలో సమావేశం అయ్యారు.
ఈ సమావేశంలో కేంద్రమంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, రఘువీరారెడ్డి, అనంత వెంకట్రామిరెడ్డి, టీజీ వెంకటేష్, ఏరాసు ప్రతాప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇక రాష్ట్ర విభజన అనివార్యమైతే రాయల తెలంగాణను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్ సీనియర్ నేత జెసి దివాకర్ రెడ్డి ఈ విషయమై త్వరలో సోనియా గాంధీని కలవనున్నట్లు చెప్పిన విషయం తెలిసిందే.
సోనియా అపాయింట్మెంట్ కోరిన సీమ నేతలు
Published Tue, Nov 19 2013 2:43 PM | Last Updated on Mon, Oct 22 2018 9:16 PM
Advertisement
Advertisement