హైదరాబాద్: శాస్త్ర సాంకేతిక రంగాల అభివృద్ధికి చేసిన కృషికిగాను రీసెర్చ్ సెంటర్ ఇమారత్ (ఆర్‌సీఐ) డెరైక్టర్ జి.సతీశ్‌రెడ్డికి ప్రతిష్టాత్మక హోమీ జే బాబా స్మారక అవార్డు లభించింది. జమ్మూ విశ్వవిద్యాలయంలో సోమవారం ప్రారంభమైన జాతీయ సైన్స్ కాంగ్రెస్ సమావేశాల్లో ప్రధాని మన్మోహన్ సింగ్ ఈ అవార్డును సతీశ్‌రెడ్డికి అందజేశారు.
ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ రంగాల్లో అందించిన సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు దక్కింది. దేశ రక్షణలో కీలకపాత్ర పోషించే క్షిపణి వ్యవస్థలకు అవసరమైన ఏవియానిక్స్ టెక్నాలజీ తయారీలో సతీశ్‌రెడ్డి కీలకపాత్ర పోషించారన్నది తెలిసిందే. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ 1989 నుంచి రెండేళ్లకు ఒకసారి ఈ అవార్డును అందజేస్తోంది.
సతీశ్‌రెడ్డికి హోమీ బాబా స్మారక అవార్డు
Published Mon, Feb 3 2014 11:47 PM | Last Updated on Sat, Sep 2 2017 3:18 AM
Advertisement
Advertisement