నితీశ్, లాలూలకు సిగ్గు లేదు అని ధ్వజమెత్తిన ప్రధాని మోదీ విమర్శలను లాలూ తిప్పికొట్టారు. అటల్ బిహారీ వాజపేయి వంటి
పట్నా: నితీశ్, లాలూలకు సిగ్గు లేదు అని ధ్వజమెత్తిన ప్రధాని మోదీ విమర్శలను లాలూ తిప్పికొట్టారు. అటల్ బిహారీ వాజపేయి వంటి గొప్ప వ్యక్తి ఎదుట ‘లోక్ లజ్జ’(ప్రజా జీవితంలో ఉన్నత నైతిక విలువలు), ‘లోకహితం’(ప్రజల బాగు)ను నిలబెట్టలేని వ్యక్తి ఇప్పుడు సిగ్గు గురించి పాఠం చెప్తున్నారని ట్విటర్‌లో ఎద్దేవా చేశారు. బిహార్‌లో ప్రచారం చేస్తున్న మోదీ.. ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతే ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేస్తారా? అని ప్రశ్నించారు. మోదీ రిజర్వేషన్లకు అనుకూలమైనట్లయితే.. రిజర్వేషన్ల విధానాన్ని సమీక్షించాలంటూ ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ చేసిన సూచనలను ఎందుకు ఖండించలేదని లాలూప్రసాద్, నితీశ్ ప్రశ్నించారు.
ఆ ముగ్గిరిదే బాధ్యత: అసదుద్దీన్
కిషన్‌గంజ్: బిహార్‌లోని సీమాంచల్ వెనుకబాటుతనానికి కాంగ్రెస్, లాలూ, నితీశ్‌లదే ఉమ్మడి బాధ్యత అని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కిషన్‌గంజ్ సభలో అన్నారు.