ముంబై: అమెరికా ఫెడరల్ రిజర్వ్ నిర్వహిస్తున్న రెండు రోజుల సమావేశాలు మొదలైన నేపథ్యంలో డాలరుతో మారకంలో రూపాయి విలువ మళ్లీ తిరోగమించింది. గత రెండు వారాల్లోలేని విధంగా 54 పైసలు క్షీణించి 63.37కు చేరింది. ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో మంగళవారం 63.37 వద్ద ప్రారంభమైంది. గరిష్టంగా 62.95, కనిష్టంగా 63.64 మధ్య ఊగిసలాడింది. చివరికి క్రితం ముగింపు 62.83తో పోలిస్తే 54 పైసలు(0.86%) బలహీనపడి 63.37 వద్ద ముగిసింది. ఈ నెల 3 తరువాత ఇదే అత్యధిక క్షీణత కాగా, గత రెండు రోజుల్లో 67 పైసలు పుంజుకున్న విషయం విదితమే.