'కస్టడీ ముగిసినా ఖన్నా జైలుకు ఎందుకు?' | Sanjeev Khanna's lawyers may move plea claiming his detention on Monday was illegal | Sakshi
Sakshi News home page

'కస్టడీ ముగిసినా ఖన్నా జైలుకు ఎందుకు?'

Published Tue, Sep 8 2015 12:42 PM | Last Updated on Sun, Sep 3 2017 9:00 AM

'కస్టడీ ముగిసినా ఖన్నా జైలుకు ఎందుకు?'

'కస్టడీ ముగిసినా ఖన్నా జైలుకు ఎందుకు?'

ముంబయి: దేశంలో సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో మరో ప్రధాన నిందితుడు, ఇంద్రాణి ముఖర్జియా మాజీ భర్త సంజీవ్ ఖన్నాను పోలీసులు మంగళవారం మరోసారి ముంబయిలోని ఖర్ పోలీస్ స్టేషన్కు తరలించారు. అక్కడి నుంచి కోర్టు తీసుకెళ్లే అవకాశం ఉంది. అయితే, దీనిపై ఆయన తరుపు లాయర్లు ఆరోపణలు చేస్తున్నారు.

పోలీసులకు కస్టడీ ముగిసి 24 గంటలు పూర్తవుతున్నా అతడిని కోర్టులో హాజరుపరచకుండా నేరుగా స్టేషన్కు తరలించడం అంగీకరించకూడని నిర్ణయమని కోర్టులో పిల్ వేయనున్నారు. కేసులో కీలక విచారణ కోసం సంజీవ్ ఖన్నాను పోలీసులు కోల్కతా తీసుకువెళ్లి ప్రశ్నించిన విషయం తెలిసిందే. అయితే, ఆయన కస్టడీ ఆదివారమే పూర్తయిందని, సోమవారం కూడా అదుపులో ఉంచుకోవడం చట్ట విరుద్ధమని కోర్టులో ఫిర్యాదు చేయనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement