న్యూఢిల్లీ: జెట్ ఎయిర్‌వేస్‌లో అబుధాబికి చెందిన ఎతిహాద్ ఎయిర్‌లైన్స్ వాటా కొనుగోలు ఒప్పందానికి స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ నుంచి లైన్ క్లియర్ కానుంది. సవరించిన ఒప్పందం నిబంధనల ప్రకారమే ఉన్నట్లు సెబీ అభిప్రాయపడింది. జెట్‌లో 24 శాతం వాటా కొనుగోలు కోసం ఎతిహాద్ రూ. 2,058 కోట్లు చెల్లించేలా డీల్ కుదరడం తెలిసిందే.
దీనిపై కొన్ని నియంత్రణపరమైన అభ్యంతరాలు వ్యక్తంకావడంతో ఒప్పందాన్ని ఇరు కంపెనీలు సవరించాయి. దీనిప్రకారం విదేశీ ఎయిర్‌లైన్స్ ఎతిహాద్‌కు దేశీ విమానయాన కంపెనీ అయిన జెట్‌లో యాజమాన్య నియంత్రణ అధికారాలు ఉండవు. ఒప్పందం సవరణ నేపథ్యంలో జెట్ వాటాదారులకు ఎతిహాద్ ఓపెన్ ఆఫర్ ఇవ్వక్కర్లేదని సెబీ అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. అయితే, ఇరు కంపెనీల మధ్య సవరించిన వాణిజ్య భాగస్వామ్య ఒప్పందానికి(సీసీఏ)తుది ఆమోదం తెలిపే అంశాన్ని మాత్రం ప్రభుత్వానికే సెబీ వదిలేసినట్లు సంబంధిత వర్గాలు చెప్పాయి.సవరించిన డీల్‌కు ఈ ఏడాది జూలైలో విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు(ఎఫ్‌ఐపీబీ) కొన్ని షరతులతో ఆమోదముద్ర వేసింది. అంతిమంగా జెట్-ఎతిహాద్ ప్రతిపాదనను ప్రధాని నేతృత్వంలోని ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ(సీసీఐ) పరిశీలించి లైన్‌క్లియర్ చేయాల్సి ఉంటుంది.
జెట్-ఎతిహాద్ డీల్‌కు సెబీ లైన్‌క్లియర్!
Published Wed, Oct 2 2013 2:24 AM | Last Updated on Fri, Sep 1 2017 11:14 PM
Advertisement