Etihad Airways
-
ఎతిహాడ్ ఏయిర్‌వేస్ కీలక ప్రకటన
దుబాయ్: అబుదాబికి చెందిన ఎతిహాడ్ ఏయిర్‌వేస్ మంగళవారం కీలక ప్రకటన చేసింది. వంద కోట్ల అమెరికన్ డాలర్ల ఒప్పందంలో భాగంగా తన 38 ఏయిర్ విమానాలను పెట్టుబడి సంస్థ కేకేఆర్, లీజింగ్ కంపెనీ ఆల్టవైర్ ఎయిర్ ఫైనాన్స్‌కు విక్రయించనున్నట్లు పేర్కొంది. తాజా ఖర్చు తగ్గింపు చర్యల్లో భాగంగా ఎతిహాడ్ ఎయిర్వేస్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 38 ఏయిర్ విమానాలు, 22 ఏయిర్ బస్-A330, 16 బోయింగ్ 7777- 300ER లను ఒప్పందంలో భాగంగా పెట్టుబడి సంస్థ కేకేఆర్, లీజింగ్ కంపెనీ ఆల్టవైర్ ఎయిర్ ఫైనాన్స్‌లకు విక్రయించినట్లు ఎతిహాడ్ ఏయిర్ వేస్ ఓ ప్రకటనలో తెలిపింది. 2020 ప్రారంభంలో కొనుగోలు చేసిన బోయింగ్ 777-300ER విమానాలను తిరిగి ఎతిహాడ్ సంస్థకు లీజుకు ఇస్తామని.. అదేవిధంగా ఏయిర్‌బస్ A330లను అంతర్జాతీయ ఖాతాదారులకు కేటాయిస్తామని కేకేఆర్ సంస్థ పేర్కొంది. ఈ ఒప్పందం స్థిరత్వాన్ని అందిస్తోందని.. అదే విధంగా తమ లక్ష్యాలకు అండగా నిలడబతుందని ఎతిహాడ్ సంస్థ తెలిపింది. -
విమాన టిక్కెట్లకూ ఈఎంఐ ఆప్షన్
దుబాయ్ : ఈఎంఐ ఆప్షన్ ఇన్ని రోజులు నిత్య వాడుకలో మనం కొనుగోలు చేసే ఉత్పత్తులకు మాత్రమే చూసేవాళ్లం. కానీ తాజాగా విమాన టిక్కెట్లకు ఈఎంఐ ఆప్షన్ అందుబాటులోకి వచ్చింది. యూఏఈ విమానయాన సంస్థ ఇతిహాద్ ఎయిర్వేస్ 'ప్లై నౌ అండ్ పే లేటర్' స్కీమ్‌ను లాంచ్ చేసింది. ఈ స్కీమ్ కింద నెలవారీ ఇన్స్టాల్మెంట్లలో టిక్కెట్ ఛార్జీలను చెల్లించుకునే ఆప్షన్‌ను ఈ విమానయాన సంస్థ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ స్కీమ్ ద్వారా కుటుంబ సభ్యులు తమ విమాన టిక్కెట్లను వారి సౌలభ్యం మేరకు బుక్ చేసుకోవచ్చని, అవసరాలకు అనుగుణంగా చెల్లింపు ప్రణాళికలను ఎంచుకోవచ్చని ఇతిహాద్ ఎయిర్వేస్ తెలిపింది. పేఫోర్ట్తో భాగస్వామ్యం ఏర్పరచుకున్న అనంతరం గల్ఫ్ ప్రాంతంలో పూర్తిగా ఆటోమేటెడ్ ఆన్లైన్ ఇన్స్టాల్మెంట్ ప్లాన్లను ఆఫర్ చేస్తున్న తొలి సంస్థగా ఇతిహాద్ పేరులోకి వచ్చింది. అరబ్ వరల్డ్‌లో పేపోర్టు, దిగ్గజ పేమెంట్ సర్వీసు ప్రొవైడర్. ఈ స్కీమ్‌ను పొందడం కోసం ప్రయాణికులు ఇతిహాద్ విమానయాన సంస్థ వెబ్సైట్లో 'పే బై ఇన్స్టాల్మెంట్' ఆప్షన్‌ను ఎంపికచేసుకోవాల్సి ఉంటుంది. అనంతరం తమ దగ్గర క్రెడిట్ కార్డుంటే బ్యాంకును ఎంపికచేసుకుని, చెల్లింపు కాలాన్ని నమోదుచేయాలి. మూడు నెలల నుంచి 60 నెలల వరకు చెల్లింపు ఇన్స్టాల్మెంట్లను ఎంచుకోవచ్చు. 17 బ్యాంకుల కస్టమర్లకు అనుమతి ఉంటుందని తెలిపింది. ప్రయాణం ఎంత ఖర్చుతో కూడుకున్నదో తమకు తెలుసని, ముఖ్యంగా కుటుంబసభ్యులకు ఇది చాలా ఖర్చుతో కూడుకున్నదని ఎయిర్‌లైన్ డిజిటల్ స్ట్రాటజీ, ఇన్నోవేసన్ వైస్ ప్రెసిడెంట్ జస్టిన్ వార్బై చెప్పారు. ఒకేసారి పెద్ద మొత్తంలో చెల్లించే దిగులు అవసరం లేకుండా.. ప్రయాణాన్ని ఎంజాయ్ చేయడానికి ఇదొక గొప్ప మార్గమని పేర్కొన్నారు. ఈ స్కీమ్‌ను డిజైన్ చేసేముందు తక్కువ, మధ్య తరగతి ప్రయాణికులను, కుటుంబ సభ్యులను పరిగణలోకి తీసుకున్నామన్నారు. ప్రస్తుతం ఈ స్కీమ్ యూఏఈ, సౌదీ అరేబియా, ఈజిప్ట్ ప్రజలకు అందుబాటులో ఉండనుంది. -
ఏపీలో ఇతిహాద్ ఎయిర్ వేస్
టియాంజిన్, జూన్ 27: హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగి స్వరాష్ట్రానికి చేరుకునే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభవార్త. సమీప భవిష్యత్తులో ఏపీ వచ్చే ప్రయాణీకులు శంషాబాద్ రాకుండానే నేరుగా విజయవాడ, విశాఖ, తిరుపతి చేరుకోవచ్చు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంతర్జాతీయ విమానయాన సంస్థ ఇతిహాద్ వైస్ ప్రెసిడెంట్ విజయ్ పూనోసామితో ముఖాముఖి భేటీ అయ్యారు. విజయవాడ, విశాఖ, తిరుపతి నుంచి నేరుగా విదేశాలకు వెళ్లే సదుపాయం కల్పించటానికి ఇతిహాద్ ఎయిర్వేస్ వైస్ ప్రెసిడెంట్ విజయ్ పూనోసామి అంగీకరించారు. ఇందుకోసం పౌరవిమానయాన శాఖకు అనుమతులు కోరతామని ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబుకు చెప్పారు. ఆక్సియోనా కంపెనీ పునరుత్పాదక విద్యుత్ కేంద్రం ఆంధ్రప్రదేశ్‌లో పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తికి స్పెయిన్‌కు చెందిన ‘ఆక్సియోనా ఎనర్జీ’ ముందుకు వచ్చింది. సోమవారం టియాంజిన్ లో ప్రపంచ ఆర్ధిక వేదిక సమావేశాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆక్సియోనా ఎనర్జీ కంపెనీ టెక్నలాజికల్ హెడ్ జాక్విన్ ఎనిన్‌తో సమావేశమయ్యారు. ఎలిన్ మాట్లాడుతూ తమ కంపెనీ ఏపీలో 200 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్ కేంద్రాన్ని నెలకొల్పనున్నట్లు తెలిపారు. వచ్చే ఏడాది జూన్ నాటికి విద్యుత్ కేంద్రం నెలకొల్పుతామన్నారు. వచ్చే ఏడాది ప్రథమార్ధంలో 100 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని, 2018-19 సంవత్సరాల్లో మరో 100 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని చంద్రబాబుకు చెప్పారు. ‘ప్రపంచంలోనే తొలి భారీ సౌర విద్యుత్ కేంద్రంగా ప్రాచుర్యం పొందిన ‘నెవడా సోలార్ వన్’ నిర్మాణంలో ‘ఆక్సియోనా ఎనర్జీ’ కీలకపాత్ర పోషించింది. 2007 తర్వాత ఆక్సియోనా ఎనర్జీ కంపెనీ 9 దేశాల్లో 164 దేశాల్లో 4,500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్ధ్యం కలిగిన 164 పవన విద్యుత్ కేంద్రాలు నిర్మించింది. ఏపీలో విద్యుత్ రంగానికి టోటల్ ఎస్.ఏ చేయూత ఆంధ్రప్రదేశ్ ఇంధన రంగాన్ని అత్యంత అధునాతనంగా తీర్చిదిద్దేందుకు సహకారం అందిస్తామని టోటల్ ఎస్.ఏ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ జీరోమ్ స్మిట్ (Jerome Schmitt) ముఖ్యమంత్రి చంద్రబాబుకు హామీ ఇచ్చారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం తీసుకొచ్చి విద్యుత్ వినియోగాన్ని తగ్గించటంలో తాము తోడ్పడతామన్నారు. టోటల్ ఎస్.ఎ కంపెనీ సస్టెయినబుల్ డెవలప్మెంట్ విభాగానికి ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తున్న జీరోమ్ స్మిట్ గతంలో విదేశాల్లో ఆ కంపెనీకి ఉన్న వివిధ విభాగాల్లో సేవలందించారు. సీఎంతో డాన్ఫోస్ గ్రూప్ చైర్మన్ జోర్జన్ మాడ్స్ క్లాసన్ భేటీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడుతో డాన్ఫోస్ గ్రూప్ చైర్మన్ జోర్జన్ మాడ్స్ క్లాసన్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఆహార శుద్ధి కర్మాగారాలను ఏర్పాటుపై, మెగా కోల్డ్ చెయిన్ ప్రాజెక్టుల స్థాపనకు సంసిద్ధత తెలియజేశారు. డాన్ఫోస్ గ్రూప్ ఆహార శీతలీకరణ, ఎయిర్ కండిషనింగ్, హీట్ బిల్టింగ్స్, ఎలక్ట్రిక్ మోటార్లు, కంప్రెసర్లు, డ్రైవ్స్, పవర్ మొబైల్ యంత్రాల రంగంలో ప్రసిద్ధి చెందింది. ఆంధ్రప్రదేశ్ వేర్ హౌసింగ్ కార్పోరేషన్‌తో భాగస్వామిగా పైలెట్ ప్రాజెక్టు ప్రారంభించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు జోర్జన్ మాడ్స్ క్లాసన్‌ను కోరారు. మోడ్రన్ ఎలక్ట్రాన్ కంపెనీ సీఈఓతో సీఎం భేటీ ‘మోడ్రన్ ఎలక్ట్రాన్’ కంపెనీ సహ వ్యవస్థాపకుడు,సీఈఓ టోనీపాన్‌తో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఐటీ పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటున్న తీరును టోనీపాన్ ప్రశంసించారు. నీటి వినియోగం, ఈ-గవర్నెన్స్ లో ఐటీని ఏపీ సమర్ధంగా ఉపయోగించుకుంటోందన్నారు. ఐటీ సహకారంతో విద్యుత్తును మరింత చవకగా అందించవచ్చని చెప్పారు.మోడ్రన్ ఎలక్ట్రాన్ కంపెనీ సీఈఓ వలె యువ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను తాము ఆహ్వానిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఏపీలో పారిశ్రామికాభివృద్ధిని అధ్యయనం చేయటానికి యువ పారిశ్రామికవేత్తలను, అంకుర కంపెనీలు ప్రారంభించాలన్న ఉద్దేశం ఉన్నవారిని తమ రాష్ట్రానికి తీసుకురావాలని చంద్రబాబు కోరారు. ఎస్.ఎ.ఎస్.ఎ.సి తో సమావేశం చైనా ప్రభుత్వ ఎస్సెట్స్ సూపర్విజన్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ కమిషన్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్ ఎకనమిక్ డెలవలప్మెంట్ బోర్డుతో వ్యాపార భాగస్వామిగా రాష్ట్రాభివృద్ధికి తోడ్పడాలని కోరారు. టియాంజిన్ పారిశ్రామికవేత్తలతో ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికవేత్తలకు సుహృద్భావ సంబంధాలు ఏర్పడేందుకు ఎకనమిక్ డెవలప్మెంట్ బోర్డు ఎంఓయూ చేసుకోవాలని సూచించారు. పెట్టుబడి అవకాశాలపై అధ్యయనం చేయటానికి టియాంజిన్ పారిశ్రామికవేత్తల బృందం ఆంధ్రప్రదేశ్ లో పర్యటించాలని ముఖ్యమంత్రి ఆహ్వానించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బృందంలో ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు, ప్రభుత్వ సలహాదారు డా. పరకాల ప్రభాకర్, ఎకనమిక్ డెవలప్మెంట్ బోర్డు సీఈఓ జె. కృష్ణకిశోర్, డెవలప్మెంట్ కమిషనర్, ఎక్స్ అఫీషియో స్పెషల్ చీఫ్ సెక్రెటరీ పి.వి.రమేష్, ముఖ్యకార్యదర్శులు జి. సాయిప్రసాద్, అజయ్ జైన్, పరిశ్రమల శాఖ కార్యదర్శి సాల్మన్ ఆరోకియ రాజ్, ప్రభుత్వ కార్యదర్శి (ఐటిఇ, కమ్యూనికేషన్ విభాగం) ప్రద్యుమ్న, క్యాపిటల్ సిటీ డెవలప్మెంట్ అండ్ మేనేజిమెంట్ కార్పోరేషన్ సీఎండి శ్రీమతి డి. లక్ష్మీ పార్థసారథి తదితరులున్నారు. -
ఈ విమానం... కొంచెం కాస్ట్లీ
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన విమాన ప్రయాణాన్ని ఎతిహాద్ ఎయిర్ వేస్ ప్రారంభించింది. ఈ విమానంలో అబుదాబి నుంచి ముంబయికి ప్రయాణించాలంటే ఖర్చెంతో తెలుసా.. అక్షరాల రూ.మూడు లక్షలపైనే. అది కూడా వన్ వేకు మాత్రమే. అదే న్యూయార్క్ నుంచి ముంబయి వరకు ప్రయాణించాలంటే మాత్రం దాదాపు రూ.25లక్షలు వెచ్చించాల్సిందే. మొత్తం 496మంది ప్రయాణికులు కూర్చునే సదుపాయం ఉన్న ఈ ఎయిర్ బస్ ఏ 380 ఇప్పటికే ఈ నెల 1న ముంబయిలో అడుగుపెట్టింది కూడా. ఇందులో నివాస స్థలం, లగ్జరీ స్యూట్, షవర్ రూం, బెడ్ రూం, డబుల్ బెడ్ రూం, లివింగ్ రూమ్ వంటి సౌకర్యాలు ఉండి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన విమాన ప్రయాణంగా ఇది నిలిచింది. ఈ విమానం నడిపే సంస్థ విడుదల చేసిన ప్రకటన ప్రకారం అబుదాబి నుంచి ముంబయి మధ్య ఒకసారి ప్రయాణించాలంటే రూ.3.31లక్షలు వెచ్చించాల్సిందే. అలాగే లండన్ నుంచి ముంబయికి ఒకసారి ప్రయాణించాలంటే రూ.17.25లక్షలు ఖర్చవుతుంది. -
విమానంలోనే బెడ్రూం, బాత్రూం!!
పిండికొద్దీ రొట్టె అంటారు.. డబ్బు ఎంత ఎక్కువ ఖర్చుపెట్టుకుంటే అన్ని ఎక్కువ సుఖాలను అందిస్తామంటూ ముందుకొస్తున్నాయి విమానయాన సంస్థలు. మధ్యప్రాచ్య ప్రాంతానికి చెందిన ఎతిహాద్ ఎయిర్వేస్ ఇప్పుడు బాగా డబ్బున్నప్రయాణికుల కోసం సరికొత్త సౌకర్యాలు అందుబాటులోకి తెస్తోంది. ఎ-380 విమానంలో ప్రత్యేకంగా ఫస్ట్‌క్లాస్ టికెట్ బుక్ చేసుకుంటే, వాళ్లకోసం ఓ చిన్నపాటి సూట్ అందిస్తోంది. అందులో ఓ మంచి బెడ్రూంతో పాటు ప్రైవేటు బాత్రూం, అందులో షవర్, ప్రత్యేకంగా వారికోసమే కేటాయించిన ఓ బట్లర్ కూడా అందుబాటులో ఉంటారన్నమాట. ఈ సంవత్సరం డిసెంబర్ నెల నుంచి తమ డబుల్ డెక్కర్ ఎయిర్‌బస్ ఎ 380 విమానాల్లో ఈ సదుపాయం ఉంటుందని ఈ ప్రభుత్వరంగ సంస్థ ప్రకటించింది. -
జెట్ డీల్‌లో ఎతిహాద్పై రూ. కోటి జరిమానా
న్యూఢిల్లీ: జెట్ ఎయిర్వేస్లో వాటాల కొనుగోలు డీల్ విషయంలో అబు ధాబికి చెందిన ఎతిహాద్ ఎయిర్వేస్పై కాంపిటీషన్ కమిషన్ (సీసీఐ) రూ. 1 కోటి జరిమానా విధించింది. 24 శాతం వాటాల కొనుగోలుకి సంబంధించి అనుమతులు కోరే అంశంలో పూర్తి సమాచారం అందించలేదన్న ఆరోపణలు ఇందుకు కారణం. 60 రోజుల్లోగా ఎతిహాద్ ఈ మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. అయితే, ఒప్పందానికి గతంలో ఇచ్చిన అనుమతులపై ఈ పెనాల్టీ ప్రభావమేమీ ఉండదని సీసీఐ పేర్కొంది. లండన్ ఎయిర్‌పోర్టులో స్లాట్ల పరస్పర బదలాయింపు లావాదేవీ వివరాలను కూడా వెల్లడించాల్సి ఉంటుందన్న నిబంధన తెలియలేదన్న ఎతిహాద్ విన్నపాన్ని పరిగణనలోకి తీసుకుని జరిమానాను రూ. 1కోటికే పరిమితం చేసినట్లు తెలిపింది. అయితే, సీసీఐలో మెజారిటీ సభ్యుల అభిప్రాయానికి భిన్నంగా మరో సభ్యుడు అనురాగ్ గోయల్ మాత్రం పెనాల్టీ రూ. 10 కోట్ల మేర ఉండాలని అభిప్రాయపడ్డారు. -
అవకతవకలు రుజువైతే జెట్-ఎతిహాద్ డీల్ రద్దు!
న్యూఢిల్లీ: జెట్ ఎయిర్వేస్లో వాటా కొనుగోలు కోసం ఎతిహాద్ ఎయిర్వేస్ కుదుర్చుకున్న ఒప్పందంలో అవకతవకలు ఉన్నట్లు రుజువైతే.. ఈ డీల్‌ను రద్దు చేస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. జెట్-ఎతిహాద్ ఒప్పందం సహజవనరులను దుర్వినియోగం చేయడం(ఎయిర్‌స్పేస్ ఇతరత్రా) కిందికి వస్తుందని, ప్రజా ప్రయోజనాలకు విరుద్ధమంటూ బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు విచారణ సందర్భంగా శుక్రవారం ఈ ఆదేశాలు జారీచేసింది. అదేవిధంగా పౌరవిమానయాన రంగంపై కార్పొరేట్ లాబీయిస్ట్ నీరా రాడియా మాటలకు సంబంధించి ట్యాప్ చేసిన టెలిఫోన్ సంభాషణల రాతప్రతులను ప్రభుత్వం బయటపెట్టేలా ఆదేశాలించాలన్న పిటిషనర్ వాదనపైనా సుప్రీంకోర్టు స్పందించింది. కేంద్రం, ఆదాయపు పన్ను శాఖలకు నోటీసులు జారీచేసింది. కాగా, తన పిటిషన్‌పై కేంద్రం తన స్పందనను తెలియజేయకపోవడంపై స్వామి అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై తమకు నాలుగు వారాల వ్యవధి కావాలని సొలిసిటర్ జనరల్ మోహన్ పరాశరణ్ సుప్రీంను కోరారు. అయితే, ఎయిర్ ఏషియా డీల్పైనా ఇలాంటి పిటిషన్ దాఖలు కాగా, సుప్రీం కోర్టు దీన్ని విచారణకు స్వీకరించలేదని, ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాలని సూచించిన విషయాన్ని పరాశరణ్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. జెట్-ఎతిహాద్ డీల్‌పై పిటిషన్‌కు కూడా విచారణార్హత లేదని ఆయన వాదించారు. అయితే, ప్రాథమిక అంశాల ఆధారంగా ఈ కేసులో ఇప్పటికే తాము నోటీసులు జారీచేసినట్లు సుప్రీం కోర్టు బెంచ్ పేర్కొంది. ఏవైనా అక్రమాలు చోటుచేసుకున్నట్లు తేలితే కచ్చితంగా ఈ ఒప్పందాన్ని పక్కనబెడతామని పిటిషనర్‌కు బెంచ్ హామీఇచ్చింది. జెట్ ఎయిర్వేస్లో 24 శాతం వాటాను చేజిక్కించుకోవడానికి ఎతిహాద్ కుదుర్చుకున్న ఒప్పంద ప్రక్రియ ఇటీవలే పూర్తయింది. ఈ డీల్ విలువ రూ.2,069 కోట్లు. -
జెట్-ఎతిహాద్ డీల్ పూర్తి
న్యూఢిల్లీ: దేశీయ విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్లో అబుధాబీ కంపెనీ ఎతిహాద్‌కు 24% వాటా లభించింది. ఇందుకు ఎతిహాద్ రూ. 2,069 కోట్లను వెచ్చించింది. డీల్ పూర్తయినట్లు రెండు కంపెనీలూ సంయుక్తంగా ప్రకటించాయి. ఈ నెల 12కల్లా అన్ని రకాల అధికారిక నియంత్రణ సంస్థల నుంచి అనుమతులు పొందడం ద్వారా డీల్‌ను పూర్తిచేయగలిగినట్లు తెలిపాయి. వెరసి దేశీయ విమానయాన సంస్థలో ఒక విదేశీ కంపెనీ చేసిన తొలి పెట్టుబడి(ఎఫ్‌డీఐ)గా ఈ డీల్ నిలిచింది. దీంతో రూ. 10 ముఖ విలువగల 2,72,63,372 షేర్లను ఎతిహాద్ ఎయిర్వేస్కు జెట్ కేటాయించింది. ప్రిఫరెన్షియల్ ప్రాతిపదికన షేరుకి రూ. 754.74 ధరలో వీటిని జారీ చేసింది. ఫలితంగా జెట్ ఎయిర్వేస్లో ఎతిహాద్‌కు 24% వాటా లభించింది. కాగా, నిబంధనలకు అనుగుణంగా జెట్‌లో చైర్మన్, ప్రమోటర్ నరేష్ గోయల్ వాటా 51%కు పరిమితమైంది. కంపెనీ చెల్లించిన మూలధనం 8.63 కోట్ల నుంచి 11.34 కోట్లకు పెరిగింది. ఈ నేపథ్యంలో బీఎస్ఈలో షేరు ధర 1.6% లాభపడి రూ. 326 వద్ద ముగిసింది. జెట్‌లో ఎతిహాద్ డెరైక్టర్లు బుధవారం(20)నుంచి ఎతిహాద్ ప్రెసిడెంట్, సీఈవో జేమ్స్ హోగన్తోపాటు, సీఎఫ్‌వో కూడా జెట్ ఎయిర్వేస్లో అదనపు డెరైక్టర్లుగా బాధ్యతలు నిర్వహించనున్నట్లు రెండు సంస్థలూ సంయుక్తంగా విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నాయి. వీలైనంత త్వరగా కస్టమర్లకు ఉత్తమ సర్వీసులను అందించేందుకు వీలుగా రెండు సంస్థలూ వెంటనే పరస్పరం సహకారాన్ని మొదలు పెట్టినట్లు తెలిపాయి. ఈ విషయంపై మరిన్ని వివరాలను తదుపరి వెల్లడిస్తామని తెలిపాయి. ఈ బాటలో దేశీయంగా మరిన్ని సంస్థలు కార్యకలాపాలను మొదలుపెట్టేందుకు సన్నద్ధమవుతున్నాయి. టాటాల భాగస్వామ్యంతో ఎయిర్ ఏషియా ఇండియాతో పాటు.. సింగపూర్ ఎయిర్‌లైన్స్ తోనూ టాటా గ్రూప్ జత కట్టడం తెలిసిందే. ఆర్థికంగా లాభం: ఎఫ్‌డీఐ లభించడం వల్ల కంపెనీ ఆర్థికంగా బలపడటమేకాకుండా, ప్రయాణికుల సంఖ్య పుంజుకుంటుందని డీల్ పూర్తయిన సందర్భంగా జెట్ ప్రమోటర్ గోయల్ పేర్కొన్నారు. ఉద్యోగ అవకాశాలు కూడా మెరుగుపడతాయని చెప్పారు. వేగంగా వృద్ధి చెందుతున్న మార్కెట్లలో ఇండియా ఒకటని, తాజా భాగస్వామ్యంవల్ల రెండు సంస్థలూ పటిష్టమవుతాయని ఎతిహాద్ సీఈవో హోగన్ వ్యాఖ్యానించారు. -
జెట్-ఎతిహాద్ డీల్‌కు సెబీ లైన్‌క్లియర్!
న్యూఢిల్లీ: జెట్ ఎయిర్వేస్లో అబుధాబికి చెందిన ఎతిహాద్ ఎయిర్‌లైన్స్ వాటా కొనుగోలు ఒప్పందానికి స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ నుంచి లైన్ క్లియర్ కానుంది. సవరించిన ఒప్పందం నిబంధనల ప్రకారమే ఉన్నట్లు సెబీ అభిప్రాయపడింది. జెట్‌లో 24 శాతం వాటా కొనుగోలు కోసం ఎతిహాద్ రూ. 2,058 కోట్లు చెల్లించేలా డీల్ కుదరడం తెలిసిందే. దీనిపై కొన్ని నియంత్రణపరమైన అభ్యంతరాలు వ్యక్తంకావడంతో ఒప్పందాన్ని ఇరు కంపెనీలు సవరించాయి. దీనిప్రకారం విదేశీ ఎయిర్‌లైన్స్ ఎతిహాద్‌కు దేశీ విమానయాన కంపెనీ అయిన జెట్‌లో యాజమాన్య నియంత్రణ అధికారాలు ఉండవు. ఒప్పందం సవరణ నేపథ్యంలో జెట్ వాటాదారులకు ఎతిహాద్ ఓపెన్ ఆఫర్ ఇవ్వక్కర్లేదని సెబీ అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. అయితే, ఇరు కంపెనీల మధ్య సవరించిన వాణిజ్య భాగస్వామ్య ఒప్పందానికి(సీసీఏ)తుది ఆమోదం తెలిపే అంశాన్ని మాత్రం ప్రభుత్వానికే సెబీ వదిలేసినట్లు సంబంధిత వర్గాలు చెప్పాయి.సవరించిన డీల్‌కు ఈ ఏడాది జూలైలో విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు(ఎఫ్ఐపీబీ) కొన్ని షరతులతో ఆమోదముద్ర వేసింది. అంతిమంగా జెట్-ఎతిహాద్ ప్రతిపాదనను ప్రధాని నేతృత్వంలోని ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ(సీసీఐ) పరిశీలించి లైన్‌క్లియర్ చేయాల్సి ఉంటుంది.