న్యూఢిల్లీ : రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సీమాంధ్ర టీడీపీ ఎంపీలు మంగళవారం ఉదయం పార్లమెంట్ ప్రధాన ద్వారం గేటు నెంబర్ 1 వద్ద ధర్నాకు దిగారు. ఆంధ్రప్రదేశ్ను కాపాడాలంటూ వారు ఫ్లకార్డులో ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. కాంగ్రెస్సేతర పక్షాలతో చర్చలు జరుపుతున్నామని, సభలో అవిశ్వాస తీర్మానానికి మద్దతు లభిస్తుందని భావిస్తున్నట్లు ఎంపీలు తెలిపారు. అంతకు ముందు టీడీపీ సీమాంధ్ర ఎంపీలు ....ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి నివాసంలో సమావేశం అయ్యారు. అవిశ్వాస తీర్మానం నోటీసుపై వారు చర్చ జరిపారు.