![Main Maldives Opposition party to move impeachment motion against President Muizzu - Sakshi](/styles/webp/s3/article_images/2024/01/30/maldives.jpg.webp?itok=k9phdFr0)
మాలె: మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జుపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు ప్రధాన ప్రతిపక్షం మాల్దీవియన్ డెమోక్రాటిక్ పార్టీ (ఎండీపీ) సిద్ధమవుతోంది. ఎండీపీకి పార్లమెంట్‌లో మెజారిటీ ఉంది. చైనా అనుకూల అధ్యక్షుడు ముయిజ్జు కేబినెట్‌లోకి నలుగురు మంత్రులను చేర్చుకునే అంశంపై ఆదివారం పార్లమెంట్‌లో ఓటింగ్ జరిగింది. నలుగురిలో ఒక్కరికి మాత్రమే పార్లమెంట్ ఆమోదం తెలిపింది. ముగ్గురిని తిరస్కరించింది.
ఇందుకు ఆగ్రహిస్తూ అధికార పక్షం ఎండీపీకి చెందిన స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌లపై అవిశ్వాసం ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా ప్రభుత్వ, ప్రతిపక్ష ఎంపీలు బాహాబాహీకి దిగారు. ఇద్దరు గాయపడ్డారు. ఈ పరిణామాలతో ఎండీపీ, మిత్రపక్షం డెమోక్రాట్లతో కలిసి ముయిజ్జుపై అవిశ్వాసం పెట్టాలని సోమవారం నిర్ణయించింది. పార్లమెంట్‌లో మొత్తం 80 మంది సభ్యులకు గాను ఎండీపీకి 45 మంది, డెమోక్రాట్లకు 13 మంది ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment