తనతో నా ప్రతిరోజూ స్పెషల్‌: మహేశ్‌బాబు | She makes each day of mine special, says Mahesh Babu‏ | Sakshi
Sakshi News home page

తనతో నా ప్రతిరోజూ స్పెషల్‌: మహేశ్‌బాబు

Published Thu, Jul 20 2017 9:14 AM | Last Updated on Tue, Sep 5 2017 4:29 PM

తనతో నా ప్రతిరోజూ స్పెషల్‌: మహేశ్‌బాబు

తనతో నా ప్రతిరోజూ స్పెషల్‌: మహేశ్‌బాబు

టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు గారాలపట్టి సితార పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా తన ముద్దుల కూతురికి ట్విట్టర్‌లో మహేశ్‌ స్పెషల్‌ గ్రీటింగ్స్‌ చెప్పారు. 'తను నా ప్రతిరోజును స్పెషల్‌గా మారుస్తుంది. తనకు ప్రత్యేకమైన ఈ రోజున మరింత ప్రేమ, అంతులేని ఆనందం దక్కాలి. నా కూతురు ఐదో వసంతంలో అడుగుపెట్టింది' అంటూ మహేశ్‌ ట్వీట్‌ చేశారు.

తనతో ఆనందంగా గడుపుతున్న ఫొటోలను ట్వీట్‌ చేశారు. సితార పుట్టినరోజు సందర్భంగా మహేశ్‌బాబు తాజా చిత్రం 'స్పైడర్‌' టీజర్‌ను విడుదల చేసే అవకాశముందని తెలుస్తోంది. మురగదాస్‌ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 'స్పైడర్‌' సినిమా వచ్చే సెప్టెంబర్‌ 27న విడుదల కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement