60 ఏళ్ల వృద్ధుడికి ఆరేళ్ల పాప కానుక అట! | She was a gift, Afghan priest, 60, arrested after marrying 6 old girl | Sakshi
Sakshi News home page

60 ఏళ్ల వృద్ధుడికి ఆరేళ్ల పాప కానుక అట!

Published Sun, Jul 31 2016 2:14 PM | Last Updated on Thu, Mar 28 2019 6:10 PM

60 ఏళ్ల వృద్ధుడికి ఆరేళ్ల పాప కానుక అట! - Sakshi

60 ఏళ్ల వృద్ధుడికి ఆరేళ్ల పాప కానుక అట!

అరవై ఏళ్ల వయస్సున్న ఓ ముస్లిం మతగురువు అభంశుభం తెలియని ఆరేళ్ల బాలికను పెళ్లి చేసుకున్నాడు. మతప్రకారం చెల్లించుకున్న కానుక ఆ పాప అని, అందుకే ఆమెను తాను మనువాడినట్టు ఆ వృద్ధ మతగురువు చెప్తున్నాడు. ఈ వివాహం గురించి ఆ బాలిక తల్లిదండ్రులకు కూడా తెలుసనని అంటున్నాడు. ఈ ఘటన ఆఫ్ఘనిస్థాన్‌లోని ఘోర్‌ ప్రావిన్స్‌లో జరిగింది.

ఆరేళ్ల పాపను పెళ్లి చేసుకోవడమే కాకుండా ఆ పెళ్లిని సమర్థించుకుంటున్న మతగురువు మహమ్మద్ కరీమ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. తమకు తెలియకుండా తమ బిడ్డను కిడ్నాప్‌ చేసి, ఆ తర్వాత మత గురువు పెళ్లిచేసుకున్నాడని బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ మతగురువు నుంచి బాలికను కాపాడి ఓ మహిళ సంరక్షణలో ఉంచారు. చిన్నారికి ఆ మతగురువు శారీరకంగా ఎలాంటి హాని తలపెట్టలేదని గుర్తించారు.

అయితే, మాటలు కూడా సరిగ్గారాని బాధిత బాలిక అతడిని చూసి బెంబేలెత్తినట్టు కనిపిస్తున్నదని పోలీసులు తెలిపారు. అఫ్ఘానిస్థాన్‌లో అమ్మాయిలకు 16 ఏళ్లు, అబ్బాయిలకు 18 ఏళ్లు చట్టబద్ధమైన వివాహ వయస్సు. అయితే షరియత్‌ చట్టం ప్రకారం తండ్రి లేదా, తాత ఒప్పుకుంటే చిన్నపిల్లలకు కూడా పెళ్లిలు చెయ్యొచ్చు. ఆఫ్ఘన్‌లోని చాలామంది పేదలు డబ్బుకు ఆశపడి చిన్నారులను ముసలివారికి కట్టబెట్టే ఆచారముంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement