మృత్యువును జయించిన సీఆర్‌పీఎఫ్‌ కమాండర్‌ | Shot 9 Times By Terrorists, In Coma For Weeks, CRPF Commandant Chetan Kumar Cheeta Goes Home | Sakshi

మృత్యువును జయించిన సీఆర్‌పీఎఫ్‌ కమాండర్‌

Published Thu, Apr 6 2017 4:06 AM | Last Updated on Tue, Sep 5 2017 8:01 AM

మృత్యువును జయించిన సీఆర్‌పీఎఫ్‌ కమాండర్‌

మృత్యువును జయించిన సీఆర్‌పీఎఫ్‌ కమాండర్‌

ఎన్‌కౌంటర్‌లో 9 బుల్లెట్లు తగిలి తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లిన సీఆర్‌పీఎఫ్‌ కమాండర్‌ చేతన్‌ చీతా అనూహ్యంగా కోలుకుని బుధవారం ఎయి మ్స్‌ నుంచి డిశ్చార్జి అయ్యారు.

న్యూఢిల్లీ: ఎన్‌కౌంటర్‌లో 9 బుల్లెట్లు తగిలి తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లిన సీఆర్‌పీఎఫ్‌ కమాండర్‌ చేతన్‌ చీతా అనూహ్యంగా కోలుకుని బుధవారం ఎయి మ్స్‌ నుంచి డిశ్చార్జి అయ్యారు. ఫిబ్రవరి 14న కశ్మీర్‌లోని హజ్జన్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో తీవ్రంగా గాయపడటంతో ఆయనను ఎయిమ్స్‌కు తరలించారు. ఆసుపత్రికి తీసుకువచ్చిన 24గంటల్లో  పుర్రె భాగంలో ఉన్న బుల్లెట్‌ను తొలిగించి, వివిధ రకాల సర్జరీలు చేశామని ట్రామా సర్జరీ ప్రొఫెసర్‌ సుబోధ్‌ కుమార్‌ చెప్పారు.

గాయాల వల్ల శరీరం విషతుల్యం కావటంతో ఐసీయూలో పర్యవేక్షించా మన్నారు. ఆయన 16రోజులు కోమాలో, నెలపాటు ఐసీయూలో ఉన్నారని తెలిపారు. మెదడు, కుడి కన్ను, కడుపు, కాళ్లు, ఎడమ చేతికి బుల్లెట్‌ గాయాలు అయ్యాయని, అతని కుడి కన్నుకు చూపు వచ్చే అవకాశాలు తక్కువన్నారు. తన భర్త మళ్లీ విధుల్లో చేరడమే అసలైన బహుమానమని చేతన్‌ భార్య ఉమా సింగ్‌ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
Advertisement

పోల్

Advertisement