CRPF Commandant
-
మీ త్యాగం మరువం సైనికా..
విజయనగరం క్రైమ్/సత్తెనపల్లి: చత్తీస్‌ఘడ్‌లో మావోయిస్టుల ఎదురుకాల్పుల్లో అమరత్వాన్ని పొందిన విజయనగరం జిల్లా గాజులరేగకు చెందిన ఆర్మీ జవాన్ రౌతు జగదీశ్, గుంటూరు జిల్లా గుడిపూడికి చెందిన సీఆర్పీఎఫ్ కోబ్రా కమాండర్ శాఖమూరి మురళీకృష్ణల అంత్యక్రియలు మంగళవారం అశ్రునయనాల మధ్య ముగిశాయి. జగదీశ్ మృతదేహానికి విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్యే వీరభద్రస్వామి, విశాఖ రేంజ్ డీఐజీ రంగారావులు నివాళులర్పించారు. జోహార్ జగదీశ్, భారత్ మాతాకీ జై అంటూ ఓ వైపు ఎన్సీసీ విద్యార్థులు, మరోవైపు అభిమానులు, మిత్రులు, కుటుంబసభ్యులు నినదిస్తుండగా గాజులరేగ దిగువ వీధిలో ఉన్న ఇంటి నుంచి మేళతాళాలు, బాణాసంచా పేలుళ్ల మధ్య జగదీష్ భౌతికకాయాన్ని శ్మశానవాటికకు తరలించారు. జవాన్ రౌతు జగదీశ్ అంతిమయాత్రలో పాల్గొన్న ప్రజలు అక్కడ సీఆర్పీఎఫ్ బలగాలు, ఆర్మ్డ్ రిజర్వ్ బలగాలు మౌనం పాటించగా పోలీసులు మూడు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపి నివాళులర్పించారు. సీఆర్పీఎఫ్ పోలీసులు జగదీష్ మృతదేహంపై ఉన్న జాతీయ జెండాను తీసి అతని తండ్రి సింహాచలానికి అందజేశారు. అనంతరం ఆయన అంత్యక్రియాలు నిర్వహించారు. అలాగే, శాఖమూరి మురళీకృష్ణ (32) పార్థివదేహం మంగళవారం ఉదయం గుడిపూడిలోని ఆయన స్వగృహానికి చేరుకుంది. ప్రత్యేక వాహనంలో సీఆర్పీఎఫ్ బలగాలు మురళీకృష్ణ పార్థివదేహాన్ని తీసుకువచ్చాయి. తర్వాత తాలూకా సెంటర్లోని సత్తెనపల్లి రూరల్ పోలీస్‌స్టేషన్ ఎదుట పార్థివదేహాన్ని కొద్దిసేపు ఉంచి బాణాసంచా కాల్చారు. అనంతరం ప్రత్యేక వాహనంపై మురళీకృష్ణ పార్థివదేహాన్ని ఉంచారు. యువకులు బైక్‌లతో ర్యాలీ చేపట్టారు. సత్తెనపల్లి నుంచి గుడిపూడి వరకు 100 అడుగుల జాతీయ జెండాను ప్రదర్శనగా తీసుకువెళ్లారు. గ్రామంలో మురళీకృష్ణ ఇంటి వద్ద పార్థివదేహాన్ని బాక్సులో నుంచి తెరిచి తల్లిదండ్రులకు చూపించారు. మురళీకృష్ణ మృతదేహానికి వైఎస్సార్సీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే అంబటి రాంబాబు, గుంటూరు జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్, ఐజీ త్రివిక్రమ వర్మ, జిల్లా రూరల్ ఎస్పీ విశాల్ గున్నీ తదితరులు ఘనంగా నివాళులర్పించారు. శ్మశాన వాటికలో సీఆర్పీఎఫ్ పోలీసులు గౌరవసూచకంగా గాల్లోకి 3 రౌండ్లు కాల్పులు జరిపి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. -
నిర్వీర్యం చేస్తుండగా పేలిన మందుపాతర
సాక్షి, చర్ల: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు అమర్చిన మందుపాతరను నిర్వీర్యం చేస్తుండగా అది పేలిపోవడంతో తీవ్రంగా గాయపడిన డిప్యూటీ కమాండెంట్ మృతి చెందాడు. సుకుమా జిల్లా పాలోడి క్యాంపునకు సమీపంలో గల కాసారం మార్గంలో పోలీసు బలగాలను హతమార్చేందుకు మావోయిస్టులు గతంలో మందుపాతర ఏర్పాటు చేశారు. పోలీసులు ఆదివారం దానిని గుర్తించి.. నిర్వీర్యం చేస్తున్న సందర్భంలో పేలింది. పాలోడి క్యాంపునకు చెందిన 208 కోబ్రా విభాగం డిప్యూటీ కమాండెంట్ వికాస్కుమార్ తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందాడు. చదవండి: మంత్రి పువ్వాడ అజయ్‌కు కరోనా.. చదవండి: పోలీస్ ఇన్ఫార్మర్ నెపంతో గిరిజనుడి హత్య -
సీఆర్పీఎఫ్ జవాను ఆత్మహత్య
సాక్షి, నల్లజర్ల(పశ్చిమగోదావరి) : నల్లజర్ల మండలం ముసుళ్లగుంట బామ్మచెలకకు చెందిన సీఆర్పీఎఫ్ జవాను మానుకొండ గోపినాథ్ (28) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. తండ్రి సంజీవరావు అనారో గ్యంగా ఉన్నాడన్న సమాచారంతో మేఘాలయలో పనిచేస్తున్న అతడు ఈ నెల 4న సెలవుపై గ్రామానికి వచ్చాడు. సంజీవరావు అప్పులపాలయ్యాడని ఆ అప్పుల బాధ తాళలేక కుటుంబం ఇబ్బందుల పాలైందని ఈ విషయంపై కుటుంబంలో గత రెండురోజులుగా స్వల్ప వివాదం తలెత్తింది. ఈ కారణంగా మనస్తాపం చెందిన గోపినాథ్ శనివారం మధ్యాహ్నం తమ సొంత పొలంలోనే పురుగుల మందు తాగాడు. ఈ విషయం గమనించిన స్థానికులు తాడేపల్లిగూడెం, అనంతరం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందినట్టు నల్లజర్ల ఎస్సై కె.చంద్రశేఖర్ తెలిపారు. ఆదివారం శవపంచనామా నిర్వహించారు. సాయంత్రం ముసుళ్లగుంటలో అంత్యక్రియలు జరిగాయి. కొడుకు అకాలమృతితో తల్లిదండ్రులు సంజీవరావు, జయకుమారి, అక్కలు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. మూడేళ్ల క్రితం తమ సోదరుడు ఆర్మీలో చేరాడని మృతుడి అక్కలు శ్రీదేవి, పుష్పవేణి వివరించారు. ఆర్మీ అధికారులు ఆదివారం రాత్రి ముసుళ్లగుంటకు వచ్చి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. -
‘సుక్మా’ ఘటనపై సీఆర్పీఎఫ్ సీరియస్
న్యూఢిల్లీ: ఛత్తీస్‌గఢ్‌లోని తీవ్రవాద ప్రభావిత సుక్మా జిల్లాలో ఈనెల 13వ తేదీన మందుపాతర పేలుడు ఘటనలో 11 మంది సిబ్బంది ప్రాణాలు కోల్పోవటంపై సీఆర్పీఎఫ్ తీవ్రంగా స్పందించింది. ముందు జాగ్రత్తలు తీసుకోకపోవటం వల్లే ఈ ఘటన చోటుచేసుకుందంటూ 212వ బెటాలియన్ కమాండెంట్ ఆఫీసర్(సీవో) ప్రశాంత్ ధర్‌ను ఈశాన్య సెక్టార్‌కు బదిలీ చేసింది. ఈ దుర్ఘటనకు దారి తీసిన పరిస్థితులపై విచారణకు ఆదేశించినట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 13వ తేదీన ఉదయం కిష్టారం– పలోడీ గ్రామాల మధ్య మావోయిస్టులతో ఎదురుకాల్పులు జరిగినందున, నిర్మాణంలో ఉన్న ఆ ఐదు కిలోమీటర్ల రహదారిపై ప్రయాణించేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని సీఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్(డీజీ) భట్నాగర్ హెచ్చరికలు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో అదే రోజు సాయంత్రం ఆ మార్గంలో సిబ్బందితో వెళ్తున్న మైన్‌ప్రూఫ్ వాహనాన్ని(ఎంపీవీ)మావోయిస్టులు పేల్చేశారు. దీంతో అందులోని 11మంది సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. డీజీ హెచ్చరికల నేపథ్యంలో రెండు ఎంపీవీల్లో సిబ్బంది వెళ్లాల్సి ఉండగా ఒక్క దానిలోనే బయలుదేరారు. ఏ పరిస్థితుల్లో కమాండెంట్ ధర్ ఇలాంటి ఆదేశాలు ఇచ్చారో తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు. ఆయన అజాగ్రత్త కారణంగానే ఈ ఘోరం జరిగిందని వివరించారు. కొద్ది జాగ్రత్తలతో నివారించగలిగిన ఈ ఘటన దురదృష్టకరమని పేర్కొన్నారు. వాస్తవాలు విచారణలో వెలుగు చూస్తాయని చెప్పారు. -
అనూహ్యంగా కోలుకున్న చేతన్ చీతా
-
మృత్యువును జయించిన వీరజవాన్
-
మృత్యువును జయించిన సీఆర్పీఎఫ్ కమాండర్
న్యూఢిల్లీ: ఎన్కౌంటర్లో 9 బుల్లెట్లు తగిలి తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లిన సీఆర్పీఎఫ్ కమాండర్ చేతన్ చీతా అనూహ్యంగా కోలుకుని బుధవారం ఎయి మ్స్ నుంచి డిశ్చార్జి అయ్యారు. ఫిబ్రవరి 14న కశ్మీర్‌లోని హజ్జన్లో జరిగిన ఎన్కౌంటర్లో తీవ్రంగా గాయపడటంతో ఆయనను ఎయిమ్స్‌కు తరలించారు. ఆసుపత్రికి తీసుకువచ్చిన 24గంటల్లో పుర్రె భాగంలో ఉన్న బుల్లెట్‌ను తొలిగించి, వివిధ రకాల సర్జరీలు చేశామని ట్రామా సర్జరీ ప్రొఫెసర్ సుబోధ్ కుమార్ చెప్పారు. గాయాల వల్ల శరీరం విషతుల్యం కావటంతో ఐసీయూలో పర్యవేక్షించా మన్నారు. ఆయన 16రోజులు కోమాలో, నెలపాటు ఐసీయూలో ఉన్నారని తెలిపారు. మెదడు, కుడి కన్ను, కడుపు, కాళ్లు, ఎడమ చేతికి బుల్లెట్ గాయాలు అయ్యాయని, అతని కుడి కన్నుకు చూపు వచ్చే అవకాశాలు తక్కువన్నారు. తన భర్త మళ్లీ విధుల్లో చేరడమే అసలైన బహుమానమని చేతన్ భార్య ఉమా సింగ్ చెప్పారు.