
విజయవాడలోనూ 'సిమి' కీటకాలు?
ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని ప్రాంతంలో కూడా ఉగ్రవాద సంస్థ 'సిమి' తన కార్యకలాపాలను కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. స్టూడెంట్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా (సిమి) ఉగ్రవాదులలో ఇద్దరు ఇటీవలే నల్లగొండ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో మరణించిన విషయం తెలిసిందే. (సంగారెడ్డిలో సిమి జాడలు)
తాజాగా విజయవాడలో ఐదు రోజుల క్రితం 15 మంది అనుమానితులను ఎన్ఐఏ వర్గాలు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. వారందరినీ విచారించిన తర్వాత అందులో 11 మందిని విడుదల చేశారు. మరో నలుగురు మాత్రం ఇంకా ఎన్ఐఏ అదుపులోనే ఉన్నట్లు సమాచారం. దీంతో కొత్త రాష్ట్రంలోనూ వేళ్లూనుకోడానికి 'సిమి' ప్రయత్నాలు ప్రారంభించినట్లే తెలుస్తోంది.