వైఎస్సార్‌సీపీ కండువాలు ధరించారని.. | six ysrcp corporator suspended by vijayawada mayor | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ కండువాలు ధరించారని..

Published Wed, Aug 9 2017 2:48 PM | Last Updated on Tue, May 29 2018 3:40 PM

వైఎస్సార్‌సీపీ కండువాలు ధరించారని.. - Sakshi

వైఎస్సార్‌సీపీ కండువాలు ధరించారని..

- పార్టీ కండువాలు ధరించిన వైఎస్సార్‌సీసీ కార్పొరేటర్లపై సస్పెన్షన్‌ వేటు
- కౌన్సిల్‌ మీటింగ్‌లో విజయవాడ మేయర్‌ శ్రీధర్‌ తీరుపై సభ్యుల మండిపాటు


విజయవాడ:
పార్టీ కండువాలు ధరించి వచ్చారన్న కారణంగా ఆరుగురు వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లను మేయర్‌ సస్సెండ్‌ చేయడం వివాదాస్పదమైంది.

మేయర్ కోనేరు శ్రీధర్ అధ్యక్షతన  బుధవారం విజయవాడ నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం జిరిగింది. ఈ సమావేశానికి వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు పార్టీ కండువాలు ధరించడంపై మేయర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. కండువాలు తీసి కౌన్సిల్ కు రావాలని మేయర్‌ ఆంక్షలు విధించారు.

దీంతో కండువాలు ధరించవద్దనే నిబంధనలు చూపాలని  వైసిపి కార్పోరేటర్లు పట్టుబట్టారు. సభ్యుల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోకుండా మేయర్‌ శ్రీధర్‌.. ఆరుగురు వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లను సస్పెండ్ చేశారు. దీనికి నిరసనగా వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు కౌన్సిల్ హాల్ ఎదుట ధర్నాకు దిగారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement